Health Benefits of Jaggery: బెల్లం ప్రతి ఇంట్లో ఉంటుంది. ఆయుర్వేదంలో బెల్లాన్ని ఔషధంగా పరిగణిస్తారు. ఇందులో మన శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు ఉంటాయి. బెల్లంలో ఐరన్, కాల్షియం, జింక్, కాపర్, మెగ్నీషియం, ప్రోటీన్, పాస్పరస్, వంటి ఎన్నో ఖనిజాలతో పాటు బి కాంప్లెక్స్, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఈ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. అందుకే ప్రతి రోజు ఓ చిన్న బెల్లం ముక్క తింటే మంచిదని చెబుతారు.
ఇన్ని పోషకాలు ఉన్న బెల్లాన్ని కాదని చాలా మంది చక్కెరను ఉపయోగిస్తారు. పంచదార కంటే బెల్లం చాలా రెట్లు బెటర్. బెల్లంలో అత్యధికంగా ఐరన్, ఫాస్పరస్ ఉంటుంది అందుకే బెల్లం తినడం వల్ల రక్తహీనతను తగ్గించుకోవచ్చు. ఇది మన శరీరంలో హిమోగ్లోబిన్‌ను తయారు చేయడానికి సహాయపడుతుంది. రక్తాన్ని శుద్ది చేసే గుణం బెల్లానికి ఉంటుంది. ఇక పీరియడ్స్ రాక ఇబ్బంది పడేవారికి, పీరియడ్ సమయంలో తీవ్రమైన కడుపునొప్పితో బాధపడే వారికి బెల్లం ఎంతగానో ఉపయోగపడుతుందని హెల్త్ కేర్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
ప్రతీరోజు బెల్లం తినడం వల్ల ఎముకలకు బలం చేకూరుతుంది. శరీరంలో వాపులు, నొప్పులు తగ్గుతాయి. అయితే డయాబెటీస్‌తో బాధపడేవారు తక్కువ మోతాదులో తీసుకుంటే మంచిది. గ్యాస్ ఉబ్బరం తగ్గుతాయి. జీర్ణక్రియ సాఫీగా జరగడమే కాకుండా పొట్ట ఆరోగ్యం మెరుగుపడుతుంది. నీరసం, అలసట తగ్గుతాయి. చర్మం, జుట్టు ఆరోగ్యం మెరుగుపడతాయి. రోజంతా పనిచేసేవారు బెల్లం తింటే శరీరానికి శక్తి లభిస్తుందని పౌష్టికాహార నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ఇంటర్నెట్ వేదికగా అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అందించినవి మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.