Poha Recipe: మీ పిల్లలకు లంచ్ బాక్సులో అటుకులతో 5 నిమిషాల్లో చేయగలిగే 5 రకాల టిఫిన్స్ ఇవే
Breakfast Recipe: అటుకులు ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇది తేలికగా అరిగిపోతాయి. అటుకులతో చేసే వంటకాలు చాలా త్వరగా అయిపోతాయి. మీకు సమయం కూడా ఎక్కువగా వృధా అవదు అటుకులతో చేయగలిగే ఐదు రకాల టిఫిన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీటిని మీ పిల్లలకు లంచ్ బాక్స్ లో పెట్టి ఇవ్వడం వల్ల స్కూలులో బ్రేక్ ఫాస్ట్ చేసేందుకు ఇవి ఉపయోగపడతాయి. అలాంటి ఐదు రకాల వంటకాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అటుకుల ఉప్మా లేదా పోహా:
పోహాగా పిలిచే అటుకుల ఉప్మాలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. అటుకులు అనేక రకాల పోషకాలు ఉంటాయి. సాధారణ రవ్వ ఉప్మా కన్నా కూడా ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీని తయారీ విధానం కూడా చాలా సులభం కేవలం ఐదు నుంచి పది నిమిషాల వ్యవధిలో దీని తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక కళాయిలో కొద్దిగా నూనె వేసుకోవాలి. అందులో కొన్ని పోపు గింజలు వేసి తర్వాత వేరుశనగ గింజలు కూడా వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు వేసి నూనెలో వేయించుకోవాలి. ఇప్పుడు నీళ్లలో నానబెట్టిన అటుకులను వేసి ఉప్పు కారం పసుపు వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు వేడివేడి రుచికరమైన పోహా సిద్ధమవుతుంది. ఇందులో నిమ్మకాయ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. పిల్లలకు ఇది మంచి పోషకాహారంగా చెప్పవచ్చు.
అటుకులతో దోశ:
అటుకులతో చేసే దోష చాలా సాఫ్ట్ గానూ రుచికరంగాను ఉంటుంది. పిల్లలు తినేందుకు చాలా బాగుంటుంది. సాధారణ దోశ పిండిలో బియ్యం బదులుగా అటుకులను వాడినట్లయితే ఈ అటుకుల దోష చాలా రుచికరంగా ఉంటుంది.
అటుకుల మిక్చర్:
అటుకులను కళాయిలో వేయించి అందులో పల్లీలు, సన్నటి సేవ్, అలాగే కొత్తిమీర, ఎండు కొబ్బరి ముక్కలు వేయించి కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు కారం పసుపు అలాగే కొద్దిగా పంచదార కూడా వేసుకోవచ్చు. రుచికోసం కొద్దిగా నిమ్మ ఉప్పు కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ అటుకుల మిక్చర్ చాలా రుచికరంగా ఉంటుంది.
అటుకుల లడ్డు:
అటుకులను నూనెలో వేయించి. బెల్లం పాకంలో కలిపి లడ్డూలుగా చేసుకున్నట్లయితే అటుకుల లడ్డు తయారవుతుంది ఇది చాలా రుచికరంగా ఉంటుంది. అటుకులను నూనెకు బదులుగా నెయ్యిలో వేయిస్తే లడ్డు మరింత రుచికరంగా ఉంటుంది.
అటుకుల ఇడ్లీ:
ఇడ్లీ పిండి తయారీలో భాగంగా అటుకులను కూడా చేర్చుకున్నట్లైతే, మరింత మృదువుగా వస్తాయి. తద్వారా మీ అటుకుల ఇడ్లీ తయారవుతుంది. ఇది చాలా మృదువుగా ఉండటంతో పాటు రుచికరంగా కూడా ఉంటుంది.