Fish Health Benefits: చికెన్​, మటన్​ కంటే ఫిష్​ బెస్ట్​.. ప్రయోజనాలు పోలిస్తే షాక్ అవుతారు..!

Fish Health Benefits: ఈ రోజుల్లో నాన్​వెజ్​ తినే ట్రెండ్​ బాగా పెరిగింది. దాదాపు వారానికి మూడు రోజులు నాన్​వెజ్​ తినేవారు ఉన్నారు.

Update: 2023-09-23 16:00 GMT

Fish Health Benefits: చికెన్​, మటన్​ కంటే ఫిష్​ బెస్ట్​.. ప్రయోజనాలు పోలిస్తే షాక్ అవుతారు..!

Fish Health Benefits: ఈ రోజుల్లో నాన్​వెజ్​ తినే ట్రెండ్​ బాగా పెరిగింది. దాదాపు వారానికి మూడు రోజులు నాన్​వెజ్​ తినేవారు ఉన్నారు. ముఖ్యంగా ఆదివారం వచ్చిందంటే చాలు మటన్​, చికెన్​ షాపుల దగ్గర క్యూలో నిలుచోవాల్సిన పరిస్థితి. ఎంతంటే అంత ఖర్చు పెట్టి మరీ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. అయితే ఏదైనా పరిమితికి మించి తీసుకుంటే అనర్థాలనే కలిగిస్తుంది. అలాగే మటన్​, చికెన్​లని కొన్నిసార్లు తగ్గించి చేపల వైపు మొగ్గుచూపండి. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

చికెన్, మటన్ రెగ్యూలర్​గా తినడం వల్ల శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోతుంది. దీనివల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందుకే కొన్నిసార్లు చేపలు తినడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఇందులో తక్కువ కొవ్వు ఉంటుంది. అంతేకాకుండా గుండెకి మేలు చేసే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. చేపలు తినడం వల్ల శరీరంలో సెరటోనిన్, డోపమైన్ అనే హార్మోన్లు రిలీజ్ అవుతాయి. దీంతో మానసికంగా, శరీరకంగా ఒత్తిడి తగ్గుతుంది. క్రమం తప్పకుండా చేపలు తింటే డిప్రెషన్ దూరమవుతుంది.

చేపలు తింటే మతి మరుపును తగ్గించుకోవచ్చు. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ మతి మరుపు రావడం సహజం. కానీ చేపలు ఎక్కువగా తింటే మతిమరుపు ఉండదు. అల్జీమర్స్ తో బాధపడేవరు చేపలు తినడం వల్ల మతి మరుపును తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగేక్రమం తప్పకుండా చేపలు తినే వారిలో కంటి సమస్యలు ఉండవు. చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రక్త నాళాల్లో అడ్డంకులు లేకుండా చూస్తాయి. దీంతో గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

Tags:    

Similar News