International Womens Day 2024: అవనిలో సగం ఆకాశంలో సగం.. ఈ ఏడాది ఉమెన్స్‌ డే థీమ్‌ ఏంటంటే..?

International Womens Day 2024: ప్రతి ఏడాది మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్నినిర్వహిస్తారు.

Update: 2024-02-29 12:30 GMT

International Womens Day 2024: అవనిలో సగం ఆకాశంలో సగం.. ఈ ఏడాది ఉమెన్స్‌ డే థీమ్‌ ఏంటంటే..?

International Womens Day 2024: ప్రతి ఏడాది మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్నినిర్వహిస్తారు. అవనిలో సగం ఆకాశంలో సగం అంటూ వారిని మహిళా సాధికారత దిశగా తీసుకెళ్లడానికి ఉమెన్స్‌ డే మొదలుపెట్టారు. ప్రతి ఏడాది ఏదైనా ఒక అంశాన్ని తీసుకొని అందులో మహిళలు విజయం సాధించేలా అవగాహన కల్ఫిస్తారు. మహిళలు రాజకీయ, సామాజిక, ఆర్ధిక రంగాల్లో స్వావలంబన సాధించేలా వారి హక్కుల గురించి అవగాహన కల్పించేలా ఈ వేడుకను జరుపుకుంటారు. ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని "ఇన్‌స్పైర్ ఇన్‌క్లూజన్” ("Inspire Inclusion") అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

"ఇన్‌స్పైర్ ఇన్‌క్లూజన్” అంటే విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన మహిళలను గౌరవించి వారు ఎలా విజయం సాధించారు అనే విషయాలు తెలుసుకోవడం, రాజకీయాలు, వ్యాపారం మొదలైన రంగాల పట్ల వారి అభిప్రాయాలను తెలుసుకొని అవగహన కల్పించడం దీని ఉద్దేశ్యం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళల విజయాలను జరుపుకోవడానికి, లింగ సమానత్వం కోసం పిలుపునిచ్చే రోజు. వివిధ రంగాలలో మహిళలు చేస్తున్న సేవలను గుర్తించి, వారి హక్కులు, సాధికారత కోసం మద్దతునిచ్చే రోజు.

అంతర్జాతీయ మహిళాదినోత్సవం పుట్టుక..

అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది. దాదాపు శతాబ్దానికి ముందు నుంచే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు మార్చి 8న మహిళలకు ప్రత్యేకమైన రోజుగా గుర్తించి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుతున్నారు. 1908లో తక్కువ పనిగంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం యూఎస్ లోని న్యూ యార్క్ సిటీలో 15 వేల మంది మహిళలు ప్రదర్శన చేశారు. నాడు మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది.

ఐక్యరాజ్యసమితి గుర్తింపు..

ప్రతి ఏటా మార్చ్ 8న అమెరికాలో జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించడంతో అంతర్జాతీయంగా కూడా మహిళా దినోత్సవాన్ని నిర్వహించాలని ఆలోచన వచ్చింది. క్లారా జెట్కిన్ అనే ఒక మహిళ 17 దేశాల ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్స్ సదస్సులో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రతిపాదన చేయగా దానికి కాన్ఫరెన్స్ కు వచ్చిన అన్ని దేశాల మద్దతు లభించింది. అప్పటి నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. అయితే 1975వ సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి గుర్తించి ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తుంది.

Tags:    

Similar News