మహిళలకి అలర్ట్‌.. ఈ లక్షణాలు కనిపిస్తే అది PCOS అని గుర్తించండి..!

మహిళలకి అలర్ట్‌.. ఈ లక్షణాలు కనిపిస్తే అది PCOS అని గుర్తించండి..!

Update: 2022-10-30 10:26 GMT

మహిళలకి అలర్ట్‌.. ఈ లక్షణాలు కనిపిస్తే అది PCOS అని గుర్తించండి..!

Womens Health: ఈ రోజుల్లో చాలామంది మహిళలు PCOS (Polycystic Ovarian Syndrome) సమస్యకి గురవుతున్నారు.ఇది మహిళల్లో సంభవించే హార్మోన్ల రుగ్మత అని చెప్పవచ్చు. దీనివల్ల రుతుచక్రంలో తేడాలు వస్తాయి. అండాశయాల దగ్గర సమస్యలు ఏర్పడుతాయి. పీసీఓఎస్ కారణంగా మహిళల్లో వంధ్యత్వం సంభవిస్తుంది . ఈ వ్యాధి కారణంగా ఊబకాయం, మధుమేహం సమస్య పెరుగుతుంది.

మహిళలు మొదట్లోనే పీసీఓఎస్‌ లక్షణాలని గుర్తిస్తే నయం చేయడం సులువవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఈ లక్షణాలని జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. సకాలంలో పీరియడ్స్ రాకపోవడం, ముఖం, శరీరంపై వెంట్రుకలు పెరగడం, ఊబకాయం రావడం, జుట్టు రాలడం, గర్భం దాల్చడంలో ఇబ్బంది ఉండటం, పీసీఓఎస్‌ ప్రారంభ లక్షణాలుగా చెప్పవచ్చు. 70 నుంచి 80 శాతం మంది మహిళల్లో బరువు పెరగడం అనేది ఈ వ్యాధి ప్రారంభ లక్షణంగా చెబుతారు.

చిన్న వయసులోనే ఈ సమస్య

వైద్యుల ప్రకారం ఈ వ్యాధి చెడు జీవనశైలి కారణంగా సంభవిస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఈ సమస్య జన్యుపరమైన కారణాల వల్ల కూడా ఏర్పడుతుంది. ఇప్పుడు 19 నుంచి 26 ఏళ్ల వయసు అమ్మాయిల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. అంతే కాకుండా ఒత్తిడి, నిద్రలేమి, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా పీసీఓఎస్ సమస్య వస్తుంది.

సంతానోత్పత్తిపై ప్రభావం

వైద్యుల అభిప్రాయం ప్రకారం ఈ వ్యాధి మహిళల పునరుత్పత్తిపై ప్రభావం చూపుతుంది. ఈ సమస్య మెటబాలిక్ డిస్ఫంక్షన్‌తో ముడిపడి ఉంటుంది. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు. లేదంటే పీసీఓఎస్‌ కారణంగా ఊబకాయం, మధుమేహం వంటి వ్యాధులు సంభవిస్తాయి.

పీసీఓఎస్‌ కారణంగా మహిళలు అధిక కొలెస్ట్రాల్, బీపీ, గుండె జబ్బులని కూడా ఎదుర్కొంటారు. ఈ వ్యాధికి సరైన చికిత్స లేదు. లక్షణాలని గమనించి జీవనశైలిలో మార్పులు చేయడం ద్వారా నిరోధించవచ్చు.ఈ వ్యాధితో పోరాడుతున్న మహిళలు బరువును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అవసరం. అలాగే శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంతోపాటు రోజూ కనీసం ఏడు గంటలపాటు నిద్రపోవాలి. మానసిక ఒత్తిడికి గురికావద్దు. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండటం అవసరం.

Tags:    

Similar News