శీతాకాలం వచ్చేస్తుంది.. ఇది లేకుంటే పిల్లలు, వృద్దులు ఇబ్బందిపడుతారు..!

Technology News: శీతాకాలం వచ్చేస్తోంది కాబట్టి తప్పనిసరిగా కొనుగోలు చేయవలసినది రూమ్‌ హీటర్. ఇది లేకుంటే పిల్లలు, వృద్ధులు చాలా ఇబ్బంది పడుతారు.

Update: 2023-10-11 14:00 GMT

శీతాకాలం వచ్చేస్తుంది.. ఇది లేకుంటే పిల్లలు, వృద్దులు ఇబ్బందిపడుతారు..!

Technology News: శీతాకాలం వచ్చేస్తోంది కాబట్టి తప్పనిసరిగా కొనుగోలు చేయవలసినది రూమ్‌ హీటర్. ఇది లేకుంటే పిల్లలు, వృద్ధులు చాలా ఇబ్బంది పడుతారు. చలికి తట్టుకోలేక వణికిపోతుంటారు. వాతావరణంలో మార్పుల వల్ల చలి విపరీతంగా పెడుతోంది. ఉష్ణోగ్రత మైనస్‌లోకి పడిపోతుంది. ఇలాంటి సందర్భాలలో రూమ్‌ హీటర్‌ తప్పనిసరి అవుతుంది. ఈ రోజు సరసమైన ధరలలో లభించే హీటర్ల గురించి తెలుసుకుందాం.

1. Orpat OEH-1220, 2000 watts హీటర్

Orpat OEH-1220, 2000 వాట్ ఫ్యాన్ హీటర్ స్పాట్ హీటింగ్ కోసం రూపొందించారు. 250 చదరపు అడుగుల వరకు చిన్న, మధ్య తరహా గదులకు ఇది సెట్‌ అవుతుంది. శక్తివంతమైన హీటింగ్ ఎలిమెంట్‌ను అందిస్తుంది. ఇది ఉష్ణోగ్రత సరిగ్గా ఉండేలా చేస్తుంది. దీనికి 2 హీట్ సెట్టింగ్‌లు (1000 వాట్స్, 2000 వాట్స్) ఎంపికలు ఉంటాయి. మీ ఎంపిక ప్రకారం గది హీటర్‌ను సెట్ చేసుకోవచ్చు. హీటర్‌లో సేఫ్టీ మెష్ గ్రిల్, కూల్ టచ్ బాడీ, సేఫ్టీ కట్ ఆఫ్, ఓవర్‌హీట్ ప్రొటెక్షన్ వంటి ముఖ్యమైన భద్రతా ఫీచర్లు ఉన్నాయి. థర్మల్ కట్ ఆఫ్ ప్రొటెక్షన్ అదనపు లేయర్ కూడా చేర్చబడింది. ఇది చిన్న ప్రదేశాల్లో మరింత శక్తివంతంగా పనిచేస్తుంది.

2. Activa Heat-Max 2000 watts రూమ్ హీటర్

యాక్టివా హీట్-మాక్స్ 2000 వాట్ రూమ్ హీటర్ అనేది వివిధ సైజుల గదులను వేడి చేయడానికి నమ్మదగిన ఎంపిక. రెండు హీట్ సెట్టింగ్‌లతో (1000 వాట్స్, 2000 వాట్స్)తో వస్తుంది. ఈ రూమ్ హీటర్‌లోని వేడి తీవ్రతను సులభంగా సర్దుబాటు చేయవచ్చు. ఇది చాలా భద్రతా ఫీచర్లతో వస్తుంది. హీటర్ 10 అడుగుల మంచి ఎయిర్ త్రో పరిధిని అందిస్తుంది. ఇది చిన్న, మధ్య తరహా గదులకు అనుకూలంగా ఉంటుంది. దీని తేలికైన పోర్టబుల్ డిజైన్ ఎక్కడికైనా తీసుకెళ్లడంలో సహాయపడుతుంది.

3. Bajaj Majesty RX11 2000 Watts రూమ్ హీటర్

Bajaj Majesty RX11 2000 వాట్ హీట్ కన్వెక్టర్ రూమ్ హీటర్ 2000 వాట్ హీటింగ్ కెపాసిటీతో ఇన్‌స్టంట్ హీటింగ్‌ను అందిస్తుంది. చలికాలంలో సౌకర్యంగా ఉంటుంది. రెండు హీట్ సెట్టింగ్స్‌తో (1000 వాట్స్, 2000 వాట్స్) అందుబాటులో ఉన్నాయి. హీటర్ త్వరగా వేడెక్కకుండా నిరోధించడానికి ఆటో థర్మల్ షట్-ఆఫ్, థర్మల్ ఫ్యూజ్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

Tags:    

Similar News