Health Tips: చల్లటి ఆహారం తింటున్నారా.. వేడి ఆహారం తింటున్నారా.. తేడాలు తెలిస్తే షాక్..!
Health Tips: సరైన ఆహారం తిన్నప్పుడే ఆరోగ్యం సరిగ్గా ఉంటుంది. లేదంటే అనారోగ్యానికి గురవుతారు.
Health Tips: సరైన ఆహారం తిన్నప్పుడే ఆరోగ్యం సరిగ్గా ఉంటుంది. లేదంటే అనారోగ్యానికి గురవుతారు. చాలామంది చల్లటి ఆహారం తింటున్నామా.. వేడి ఆహారం తింటున్నామా.. అనే విషయాన్ని పట్టించుకోరు. కానీ ఈ రెండింటి మధ్య చాలా తేడాలున్నాయి. సాధారణంగా ఇంట్లో అందరూ వేడి ఆహారాన్ని తింటారు కానీ ఆఫీస్, స్కూల్ ఇతర పనుల దగ్గర చల్లటి ఆహారాన్ని తినాల్సి ఉంటుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం వేడి ఆహారం ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ రెండింటి మధ్య తేడాల గురించి ఈరోజు తెలుసుకుందాం.
సులభంగా జీర్ణం
వేడివేడి ఆహారం తినడం వల్ల కడుపు నొప్పి తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేడి ఆహారం మన శరీరంలోకి చేరినప్పుడు అది సులభంగా జీర్ణమవుతుంది. దీన్ని జీర్ణం చేయడానికి శరీరం కష్టపడాల్సిన అవసరం ఉండదు. కానీ చల్లని ఆహారాన్ని తింటే అది కడుపు సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. అంతేకాదు వేడి ఆహారంపై ఉండే ఇష్టం చల్లటి ఆహారంపై ఉండదు.
పోషకాలు పుష్కలం
వేడి ఆహారంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ చల్లని ఆహారంలో బ్యాక్టీరియా ఉంటుంది. వేడి ఆహారంలో బ్యాక్టీరియా అస్సలు ఉండదు. కొన్నిసార్లు చల్లటి ఆహారం వాసన కోల్పోతుంది. దీనివల్ల తినడానికి ఇష్టంగా ఉండదు. అంతేకాదు కొన్ని ఆహారలు చల్లగా మారడం వల్ల పోషకాలు నశిస్తాయి. అందుకే ఎల్లప్పుడు వేడి ఆహారం బెస్ట్.
జీవక్రియను పెంచుతుంది
వేడి ఆహారాన్ని తినడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. అంతేకాదు అది మరింత రుచికరంగా ఉంటుంది. దీని కారణంగా ఆకలి స్వయంచాలకంగా పెరుగుతుంది. ఇది జీవక్రియపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. కానీ చల్లని ఆహారం తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. దీనివల్ల ఉదర సమస్యలు ఏర్పడుతాయి. అంతేకాదు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. అందుకే ఎల్లప్పుడు వేడి ఆహారం తినడానికి ప్రయత్నించండి.