Weight Loss Tips: వేగంగా బరువు తగ్గాలా.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు.. రిజల్ట్ చూస్తే ఆశ్చర్యపోతారంతే..!
Weight Loss Tips: ప్రస్తుతం పెరుగుతున్న బరువు కారణంగా చాలామంది ఆందోళన చెందుతున్నారు.
Weight Loss Tips: ప్రస్తుతం పెరుగుతున్న బరువు కారణంగా చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఎన్నో ప్రయత్నాలు చేసినా సరైన ఫలితం పొందలేక పోతున్నారు. బరువులో మాత్రం ఎటువంటి మార్పు లేక విసిగిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సహజ పద్ధతులను పాటించి, ఈజీగా బరువు తగ్గొచ్చు. ఈ సహజ పద్ధతుల్లో కరివేపాకు కూడా కీలకపాత్ర పోషిస్తుంది. కరివేపాకు రుచి, సువాసనతో వంటకాల మాధుర్యాన్ని రెట్టింపు చేస్తుంది. కరివేపాకులో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఇవి మన ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. ఇది కాకుండా, కరివేపాకులను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల మీరు స్లిమ్, ఫిట్‌గా మారొచ్చు.
పోషకాలు అధికం..
కరివేపాకులో ఫైబర్, ఫాస్పరస్, మెగ్నీషియం, కాపర్, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. దీని కారణంగా జీర్ణవ్యవస్థ బాగా పని చేయగలదు. బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. కరివేపాకు సూపర్‌ఫుడ్‌లలో ఒకటిగా పేర్కొంటారు. ఇది అధిక కొవ్వును తగ్గించడంతో పాటు బరువు తగ్గడంలో సహాయపడుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడే కొన్ని కొవ్వును కరిగించే అంశాలు కరివేపాకులో ఉంటాయి. చాలా సార్లు, శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కాకపోతే, బరువు పెరుగుతుంది. కరివేపాకు కూడా షుగర్ లెవెల్‌ని కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది.
బరువు తగ్గడమే కాకుండా, కరివేపాకు తినడం వల్ల అనేక ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కంటి చూపును పెంచుతుంది. ఇది కాకుండా, జ్ఞాపకశక్తిని పదును పెట్టడం, వికారం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. కరివేపాకులో ఐరన్, ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటాయి. దీని కారణంగా రక్తహీనత ప్రమాదం నుంచి కూడా రక్షిస్తుంది.
ఇలా ఉపయోగించండి..
కరివేపాకును ఖాళీ కడుపుతో తింటే బరువు తగ్గుతారు. కావాలంటే కరివేపాకుతో కషాయం చేసి తాగవచ్చు. దీని కోసం, ఒక గ్లాసు నీటిని మరిగించి, అందులో 10-15 కరివేపాకులను వేయండి. కొద్దిసేపు తక్కువ మంట మీద ఉడికించాలి. నీరు కాస్త చల్లారగానే వడగట్టి తాగాలి. కావాలంటే కొద్దిగా తేనె లేదా నిమ్మరసం కలుపుకుని కూడా తాగవచ్చు. అలాగే కరివేపాకును గోరువెచ్చని నీటితో నమిలి కూడా తినవచ్చు.