నడవండి.. డబ్బులు గెలవండి.. ఫిట్ నెస్ యాప్స్ బంపర్ ఆఫర్

*గ్రో ఫిట్టర్ యాప్ ను మీ మొబైల్ లో డౌన్ లోడ్ చేసుకుంటే మీకు 20 పాయింట్లు వస్తాయి.

Update: 2023-05-09 14:17 GMT

నడవండి.. డబ్బులు గెలవండి.. ఫిట్ నెస్ యాప్స్ బంపర్ ఆఫర్

Walking: కరోనా కారణంగా ప్రతి ఒక్కరిలో ఆరోగ్యం పై శ్రద్ధ పెరిగింది. ఆహార అలవాట్లలో మార్పుతో పాటు ఆరోగ్య నియమాలు పాటిస్తున్నారు. ఇందులో భాగంగా నడక వంటి వ్యాయామాలపై దృష్టి పెడుతున్నారు. ఇలాంటి వారికి ఇప్పుడు అద్భుత అవకాశం లభించింది. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటూనే డబ్బు సంపాదించే అవకాశాన్ని కొన్ని అప్లికేషన్లు కల్పిస్తున్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే, గ్రో ఫిట్టర్, స్టెప్ సెట్ గో, హేవ్ ఫిట్ నెస్ యాప్ లు ప్రత్యేక పాయింట్లు, బహుమతుల రూపంలో స్మార్ట్ ఫోన్ యూజర్లను ఆకర్షిస్తున్నాయి. గ్రో ఫిట్టర్ యాప్ ను మీ మొబైల్ లో డౌన్ లోడ్ చేసుకుంటే మీకు 20 పాయింట్లు వస్తాయి. వేరొకరికి రిఫర్ చేస్తే 15 పాయింట్లు లభిస్తాయి. వీటితో పాటు మీరు రోజూ 1000 అడుగులు వేస్తే ఒక పాయింట్ వస్తుంది. ఇలా మీరు ఎన్ని అడుగులు వేస్తే అన్ని పాయింట్లు మీకు లభిస్తాయి. ఈ పాయింట్లను రిడీమ్ చేసుకొని ఆన్ లైన్ లో మీరు వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చు.

ఇక మరో యాప్ స్టెప్ సెట్ గో కూడా గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది. ఇది ఒక పెడో మీటర్. క్యాలరీ కౌంటర్ అలాగే స్పోర్ట్స్ ట్రాకర్. ఈ యాప్ తన యూజర్లకు ఆకర్షణీయమైన బహుమతులను అందిస్తోంది. మీరు వేసే ప్రతి అడుగును కౌంట్ చేసి..ఈ యాప్ ద్వారా ఐఫోన్ వంటి ఖరీదైన బహుమతులను సొంతం చేసుకోవచ్చు. ఈ యాప్ ను భారత్ తో సహా అనేక దేశాల్లో అత్యధికంగా డౌన్ లోడ్ చేసుకున్నారు. గ్రో ఫిట్టర్, స్టెప్ సెట్ గో తరహాలోనే హేవ్ ఫిట్ నెస్ సైతం వ్యాయామంతో డబ్బు సంపాదించే అవకాశాన్ని కల్పిస్తోంది. హేవ్ ఫిట్ నెస్ యాప్..నీరు, నిద్ర, శారీరక శ్రమను ట్రాక్ చేస్తోంది. నడిచినందుకు ఈ యాప్ కొన్ని పాయింట్లను కేటాయిస్తుంది. ఈ పాయింట్లతో ఆన్ లైన్ లో వస్తువులను కొనుగోలు చేయొచ్చు..

మొత్తానికి, మనల్ని ఎవరైనా నడవండి అని చెబితే అంతగా తలకెక్కించుకోము. కానీ, నడిస్తే డబ్బులు వస్తాయంటే మాత్రం పోటీపడి మరి నడుస్తాం కదా...మరింకెందుకు ఆలస్యం ఈ యాప్ లను డౌన్ లోడ్ చేసుకొని ఆరోగ్యానికి ఆరోగ్యం...ఆదాయానికి ఆదాయం రెండు సంపాదించుకోండి.

Tags:    

Similar News