Beauty Tips: బ్యూటిఫుల్ స్కిన్ కోసం కుంకుమ పువ్వు.. ఉపయోగం తెలిస్తే అస్సలు వదలరు..!
Beauty Tips: ప్రాచీనకాలం నుంచి భారతీయులు కుంకుమ పువ్వుని వాడుతున్నారు. ఇందులో అందాన్ని రెట్టింపు చేసే గుణాలు ఉంటాయి.
Beauty Tips: ప్రాచీనకాలం నుంచి భారతీయులు కుంకుమ పువ్వుని వాడుతున్నారు. ఇందులో అందాన్ని రెట్టింపు చేసే గుణాలు ఉంటాయి. అందుకే శతాబ్దాలుగా వాడుకలో ఉంది. అంతేకాదు బ్యూటీ ప్రొడాక్ట్స్‌లో కూడా ఉపయోగిస్తారు. గర్భవతులు పిల్లలు తెల్లగా పుట్టడానికి పాలల్లో కలుపుకొని తాగుతారు. కొందరు స్వీట్ల తయారీలో వినియోగిస్తారు. కానీ క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. కుంకుమ పువ్వు ఉపయోగించి మెరిసే చర్మాన్ని ఎలా పొందాలో ఈరోజు తెలుసుకుందాం.
కుంకుమపువ్వు ఉపయోగం
కుంకుమపువ్వులో కొన్ని ప్రత్యేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీనిని ఉపయోగించడం వల్ల ముఖంపై ఉండే మొటిమలు నయమవుతాయి. రోజూ కుంకుమపువ్వును ముఖానికి రాసుకుంటే ముఖంపై మచ్చలు పోతాయి. దీంతోపాటు ముఖం ఛాయ మెరుగుపడుతుంది. ఇది జిడ్డు, పొడి చర్మాన్ని కూడా తొలగిస్తుంది.
కుంకుమపువ్వు, నీరు
ముఖంపై సహజమైన మెరుపు కోసం కుంకుమపువ్వు నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. ఇందుకోసం ఒక గ్లాసు నీరు తీసుకొని అందులో 2 నుంచి 4 కుంకుమపువ్వులు వేసి కొద్దిగా కలబంద, తేనె మిక్స్ చేసి రాత్రంతా ఉంచాలి. తర్వాత ఉదయమే ఈ నీటిని బాగా మిక్స్ చేసి పరగడుపున తాగాలి. రోజూ ఇలా చేయడం వల్ల కొన్ని వారాల్లోనే ముఖంలో తేడా కనిపిస్తుంది.
కుంకుమపువ్వు, కొబ్బరి నూనె
చర్మం గరుకుగా, డల్‌గా మారినట్లయితే కుంకుమపువ్వు ఉపయోగించాలి. పూర్వపు చర్మం మళ్లీ మీ సొంతమవుతుంది. ఇందుకోసం 1 టీస్పూన్ నీటిలో 5 నుంచి 6 కుంకుమపువ్వులు వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం నిద్ర లేవగానే అందులో 2 చుక్కల కొబ్బరి నూనె, రెండు చుక్కల పాలు కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 20 నుంచి 25 నిమిషాల తర్వాత సాధారణ నీటితో కడుక్కోవాలి. ఇలా కంటిన్యూగా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే ముఖంలో తేడా కనిపిస్తుంది.