Additives: రంగు, రుచి కోసం వాడే అడిటివ్స్‌పై అమెరికా నిషేధం

Additives:సోడా, ప్యాకేజ్డ్ జ్యూసుల్లో రంగు, రుచి, నిల్వ సామర్ధ్యాన్ని పెంచే రసాయనాల వాడకాన్ని అమెరికా నిషేధించింది. వీటితో గుండెపోటు, జ్నాపకశక్తి కోల్పోవడం వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది.

Update: 2024-07-04 05:16 GMT

Additives: రంగు, రుచి కోసం వాడే అడిటివ్స్‌పై అమెరికా నిషేధం

Additives: సోడా, ప్యాకేజ్డ్ జ్యూసుల్లో రంగు, రుచి, నిల్వ సామర్ధ్యాన్ని పెంచే రసాయనాల వాడకాన్ని అమెరికా నిషేధించింది. కొన్ని నెలల క్రితం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ప్రాసెస్ చేసిన ఆహారాలు, సోడా, శీతల పానీయాలు మొదలైనవాటిని నిషేధించింది.తాజాగా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) సోడా, ఆహార పదార్థాలలో రంగు, రుచి కోసం కలిపే బ్రోమినేటెడ్ వెజిటబుల్ ఆయిల్‌ను నిషేధించింది. ఈ నూనె వాడకం వల్ల గుండె జబ్బులు, జ్నాపకశక్తి కోల్పోవడం వంటి అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని పేర్కొంది. ఈ నూనె ఆరోగ్యానికి ఎందుకు హానికరమో తెలుసుకుందాం.

యుఎస్ ఎఫ్‌డిఎ మంగళవారం ఈ నూనెను నిషేధిస్తున్నట్లు వెల్లడించింది.అయితే ఇంతకుముందు కూడా ఇతర దేశాల్లో ఈ నూనెను నిషేధించారు. బ్రోమినేటెడ్ వెజిటబుల్ ఆయిల్ భారతదేశంలో 1990లో నిషేధించారు. ఈ నూనెను 2008లో యూరప్ 2010లో జపాన్‌లో కూడా బ్యాన్ చేశారు. ఈ నూనెను పుల్లని పండ్ల పానీయాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇది మానవ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీంతో శీతల పానీయాలను తయారు చేసే చాలా కంపెనీలు తమ ఉత్పత్తుల నుండి బ్రోమినేట్ వెజిటబుల్ ఆయిల్‌ను తొలగించాయి.

బ్రోమినేటెడ్ కలిగే అనారోగ్య సమస్యలు:

-బ్రోమినేటెడ్ కూరగాయల నూనె ఆరోగ్యానికి హానికరం.

-దీన్ని నిత్యం తీసుకుంటే గుండె జబ్బులు, జ్నాపకశక్తి కోల్పోవడంతోపాటు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

-ఈ నూనె సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది.

- మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంది. 

Tags:    

Similar News