Health Tips: లివర్‌ ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తరచుగా తింటూ ఉండాలి.. అవేంటంటే..?

Health Tips: లివర్‌ మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. దాదాపు అన్ని పనులలో దీని అవసరం ఉంటుంది.

Update: 2023-10-01 14:00 GMT

Health Tips: లివర్‌ ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తరచుగా తింటూ ఉండాలి.. అవేంటంటే..?

Health Tips: లివర్‌ మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. దాదాపు అన్ని పనులలో దీని అవసరం ఉంటుంది. దీన్ని హెల్తీగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇది మన శరీర జీవక్రియను పెంచుతుంది. శరీరంలోని మలినాలను తొలగించడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. కానీ చాలామంది చెడు అలవాట్ల వల్ల లివర్‌ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. అందుకే లివర్‌ ఆరోగ్యానికి తోడ్పడే కొన్ని ఆహారాలను తరచుగా తింటూ ఉండాలి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

వెల్లుల్లి

వెల్లుల్లి లివర్‌కు ఒక అద్భుతమైన ఆహారం. ఇందులో అల్లిసిన్ అనే రసాయన పదార్థం ఉంటుంది. ఇది లివర్‌ను శుభ్రపరచడాన్ని ప్రోత్సహిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది లివర్‌ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

కాలీఫ్లవర్

కాలీఫ్లవర్ లివర్‌కు మంచి ఆహారం. ఎందుకంటే ఇది లివర్‌ను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి, విటమిన్ కె, ఫైబర్ ఉంటాయి. ఇది లివర్‌ దెబ్బతినే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.

పుచ్చకాయ

పుచ్చకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, లైకోపీన్ లివర్‌ ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. లివర్‌లో ఏదైనా సమస్య ఉంటే దీనిని తీసుకోవడం వల్ల నయమవుతుంది.

నువ్వుల గింజలు

నువ్వులలో ప్రోటీన్, విటమిన్ ఇ, ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి లివర్‌ ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. ఇది లివర్‌ను శుభ్రంగా ఉంచడంలో దోహదం చేస్తుంది. లివర్‌ సామర్థ్యాన్ని పెంచుతుంది.

దోసకాయ

దోసకాయ లివర్‌కు అద్భుత ఆహారం. ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో నీరు ఉంటుంది. దీని కారణంగా శరీరం నుంచి విషపూరితాలు బయటకు వెళుతాయి. దోసకాయ కాలేయాన్ని శుభ్రపరుస్తుంది.

Tags:    

Similar News