ఈ యువకుడు 12 ఏళ్ళుగా రోజుకు 30 నిమిషాలే నిద్రపోతున్నాడు...
Japanese Man:మనిషి ఆరోగ్యానికి మంచి ఆహారము మంచి వ్యాయామము ఎంత అవసరమో మంచి నిద్ర కూడా అంతే అవసరం. ప్రతిరోజు కనీసం 6 నుంచి 8 గంటల పాటు నిద్ర పోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Japanese Man:మనిషి ఆరోగ్యానికి మంచి ఆహారము మంచి వ్యాయామము ఎంత అవసరమో మంచి నిద్ర కూడా అంతే అవసరం. ప్రతిరోజు కనీసం 6 నుంచి 8 గంటల పాటు నిద్ర పోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా నిద్రపోవడం వల్ల మన శరీరంలో జరగాల్సిన మెటబాలిజం సరిగ్గా నిర్వహించవచ్చని, లేకపోతే గుండెపైన ఇతర శరీర భాగాలపైన ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారు.
కానీ జపాన్ కు చెందిన ఒక వ్యక్తి మాత్రం తన రోజువారి దినచర్యలో కేవలం 30 నిమిషాలు మాత్రమే నిద్రపోతాను అని వెల్లడించి అందరినీ షాక్ లో ముంచేశాడు. అలా నాలుగు రోజులు ఐదు రోజుల్లో కాదు గడచిన 12 సంవత్సరాలుగా తన దినచర్యలో భాగంగా కేవలం 30 నిమిషాలు మాత్రమే నిద్రపోతున్నట్లు చెప్పుకొచ్చాడు. దీంతో ఈ విషయం తెలిసిన అనంతరం డాక్టర్లు సైతం ఆశ్చర్యపోతున్నారు.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం జపాన్ కు చెందిన డైసుకే హోరి. ప్రతిరోజు 30 నిమిషాలు మాత్రమే నిద్రపోతున్నట్లు ప్రకటించాడు. అలా అతను 12 సంవత్సరాలుగా నిద్రపోవడం అనేది ఒక రకంగా చెప్పాలంటే నమ్మశక్యంగా లేదని చాలామంది నిపుణులు కొట్టి పారేస్తున్నారు. కానీ ఈ జపాన్ కు చెందిన వ్యక్తి మాత్రం తన జీవితాన్ని రెండింతలు చేసే ప్రయోగంలో భాగంగా తాను ఇలా చేస్తున్నానని చెప్పుకొచ్చాడు
ఇతను గడిచిన 12 సంవత్సరాలుగా తన శరీరాన్ని అదేవిధంగా మెదడును అతి తక్కువ సేపు రెస్ట్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టు తద్వారా తన పనితీరును మెరుగుపరుచుకున్నట్లు కూడా హోరి చెప్పుకొచ్చాడు ఇలా చేయడం వల్ల తన పనితీరులో మార్పు వచ్చిందని ఎక్కువ గంటలు పని చేయగలుగుతున్నానని హోరీ పేర్కొన్నాడు.
అంతేకాదు తన నిద్రను కంట్రోల్ చేసుకోవడానికి ఆహారం తినడానికి ఒక గంట ముందు వ్యాయామం అదేవిధంగా కాఫీ తాగడం వల్ల నిద్రను దూరం చేసుకోవచ్చని హోరి సూచిస్తున్నాడు. అయితే ఇక్కడ హోరీ చెప్తున్న అసలు విషయం ఏమిటంటే మనిషికి కొద్దిసేపు నాణ్యమైన నిద్ర సరిపోతుందని గంటల తరబడి సుదీర్ఘమైన నిద్ర అవసరం లేదని స్థిరమైన ఏకాగ్రత కోసం ఎక్కువ గంటలు పనిచేయడానికి నిద్రను తగ్గించుకోవాలని హోరి సూచిస్తున్నారు.
అయితే హోరి చేస్తున్న ఈ ప్రయోగాన్ని మరో యువతి కూడా మూడు రోజులపాటు చేసింది ఆమె 26 నిమిషాల పాటు నిద్రపోయి మూడు రోజులు పాటు పని చేస్తూ ప్రాక్టీస్ చేసింది ఇలా చేయడం వల్ల తన శరీరంలో యాక్టివిటీ పెరిగిందని మెదడు చురుగ్గా పనిచేస్తుందని ఆమె చెప్పుకొచ్చారు. అంతేకాదు హోరీ 2016 సంవత్సరంలో జపాన్ షార్ట్ స్లిప్పర్స్ ట్రైనింగ్ అసోసియేషన్ స్థాపించాడు.
గంటల తరబడి నిద్రపోయి జీవితాన్ని వేస్ట్ చేసుకోకూడదు అని అల్ట్రా షార్ట్ స్లీపర్లుగా మారేందుకు ఇతను ట్రైనింగ్ ఇస్తున్నాడు. అయితే వైద్యులు మాత్రం నిద్ర అనేది కేవలం మెదడుకు మాత్రమే కాదని శరీరంలో ఇతర భాగాలకు ముఖ్యంగా హృదయానికి నిద్ర అవసరం అని సూచిస్తున్నారు. నిద్రలేమి వల్ల కిడ్నీలు, కాలేయం, జీర్ణ వ్యవస్థ వంటివి కూడా ప్రభావితం అవుతాయని హెచ్చరిస్తున్నారు.