End Stage Liver: లివర్‌ పనిచేయదని చెప్పే చివరిదశ ఇదే.. లక్షణాలు తెలుసుకోండి..!

End Stage Liver: శరీరంలో లివర్‌ చాలా ముఖ్యమైన అవయవం. ఇది చాలా అవయవాల పనితీరుకి సహకరిస్తుంది.

Update: 2023-08-17 14:00 GMT

End Stage Liver: లివర్‌ పనిచేయదని చెప్పే చివరిదశ ఇదే.. లక్షణాలు తెలుసుకోండి..!

End Stage Liver: శరీరంలో లివర్‌ చాలా ముఖ్యమైన అవయవం. ఇది చాలా అవయవాల పనితీరుకి సహకరిస్తుంది. అయితే కొన్ని ఆహారపు అలవాట్ల వల్ల లివర్‌ దెబ్బతింటుంది. వాస్తవానికి లివర్ డ్యామేజ్ నాలుగు దశలలో జరుగుతుంది. మొదటి దశలో ఇన్‌ఫ్లమేషన్ రెండోది ఫైబ్రాసిస్‌ మూడోది సిర్రోసిస్‌ చివరగా ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ (ఈఎస్‌ఎల్‌డీ). ఈ చివరి దశ గురించి పూర్తిగా తెలుసుకుందాం.

హెపటైటిస్ సీ చివరి దశకు చేరుకుంటే లివర్ డామేజ్ గణనీయంగా పెరుగుతుంది. ఇది కొన్నేళ్లపాటు లివర్‌ను డ్యామేజ్ చేస్తుంది. ఇది ఇన్‌ఫ్లమేషన్‌తో మొదలవుతుంది. ఈ దశలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. తర్వాత సిరోసిస్ దశ రావడానికి చాలా ఏళ్లు పడుతుంది. ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్‌ని స్టేజ్ 4 సిరోసిస్‌గా కూడా పిలుస్తారు. హెపటైటిస్ సీ కారణంగా లివర్ ఫెయిల్యూర్‌ అవుతుంది.

ఈ దశలో లివర్ తన విధులను నిర్వర్తించలేదు. హెపాటిక్ ఎన్సెఫలోపతి, అస్సైట్స్ అనే ఒక రకమైన పొత్తికడుపు వాపు ఏర్పడుతుంది. ఈ పరిస్థితిలో ఉన్న ఏకైక చికిత్స కాలేయ మార్పిడి మాత్రమే. డ్యామేజ్ అయిన లివర్ స్థానంలో ఒక ఆరోగ్యవంతుడైన అవయవ దాత నుంచి సేకరించిన లివర్‌ను మార్పిడి చేస్తారు. ఇక మూడో స్టేజ్‌ సిరోసిస్‌ విషయంలో వ్యాధి తీవ్రత మరింత దిగజారకుండా చికిత్స అందిస్తారు. జరుగుతున్న హాని తగ్గించేలా ఆ చికిత్స ఉంటుంది.

ఈఎస్‌ఎల్‌డీ లక్షణాలు

రక్త స్రావం, చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారడం (జాండీస్), విపరీతమైన దురద,

ఆకలి లేకపోవడం, వికారం, కాళ్లు, పొత్తికడుపులోకి ద్రవం చేరి వాపు రావడం, ఏకాగ్రత సమస్యలు రావడం జరుగుతాయి.

Tags:    

Similar News