Monsoon Vegetables: వర్షాకాలంలో ఈ కూరగాయలు తప్పక తినాలి.. ధర తక్కువ పోషకాలు ఎక్కువ..!
Monsoon Vegetables: వర్షాకాలం ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. లేదంటే కుటుంబ సభ్యులు జబ్బున పడే అవకాశాలు ఉంటాయి.
Monsoon Vegetables: వర్షాకాలం ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. లేదంటే కుటుంబ సభ్యులు జబ్బున పడే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా తినే తిండి, తాగే నీటిపై శ్రద్ధ వహించాలి. అలాగే పోషక విలువలు ఉన్న ఆహారంపై దృష్టి సారించాలి. మాంసాహారం కన్నా శాఖాహారం ఎక్కువ తీసుకోవాలి. అలాగే పెస్టిసైడ్స్ స్ప్రే చేసిన కూరగాయలని నివారించాలి. వర్షాకాలంలో తినాల్సిన ముఖ్యమైన కూరగాయల గురించి ఈరోజు తెలుసుకుందాం.
గుమ్మడికాయ
ఈ సీజన్‌లో కూరగాయలు తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ముందుగా చెప్పుకోవాలంటే గుమ్మడికాయ చాలా బెటర్. దీనిలో నీరు పుష్కలంగా లభిస్తుంది. ఇది చాలా సులభంగా జీర్ణమవుతుంది. అంతేకాదు ఇది ఈ సీజన్‌లో చాలా చౌకగా లభిస్తుంది.
ఉసిరి
ఉసిరిలో అద్భుత ఔషధగుణాలు దాగి ఉంటాయి. అందుకే వర్షాకాలంలో ఉసిరి పచ్చడిని ఎక్కువగా తింటారు. ఇందులో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేస్తాయి. ఉసిరి ఆకులతో కుడుములు లేదా ఆకుకూరలు చేయవచ్చు. కావాలంటే బంగాళదుంపలో కలుపుకుని తినవచ్చు.
బెండ కాయ
వర్షాకాలంలో లభించే ప్రధాన కూరగాయ బెండకాయ. ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సులభంగా జీర్ణమవుతుంది. ఆహారంలో దీని రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.
బీన్స్
వర్షాకాలంలో గింజలు ఉండే కూరగాయలు కూడా లభిస్తాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఎందుకంటే కీటకాలు వీటిలోకి ప్రవేశించలేవు. మీరు చిక్కుళ్లు, సోయాబీన్ వంటి కూరగాయలని తినవచ్చు.
కాకరకాయ
కాకరకాయ రుచి చేదుగా ఉన్నప్పటికీ ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మధుమేహం, గుండె జబ్బులు ఉన్నవారు కాకరరసాన్ని తాగడం మంచిది. వర్షాకాలంలో కాకరకాయలు విరివిగా లభిస్తాయి. వీటిని తినడం వల్ల బాడీని ఫిట్‌గా ఉంచుకోవచ్చు. అంతేకాదు ధర కూడా తక్కవే.