Diabetes: షుగర్ లెవల్స్ పెరిగినప్పుడు ఈ లక్షణాలు.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం..!
Diabetes: భారతదేశంలో డయాబెటీస్ రోజు రోజుకి విస్తరిస్తోంది. ఈ సమస్యను సీరియస్‌గా తీసుకోకపోతే జీవితం సగంలోనే ముగుస్తుంది.
Diabetes: భారతదేశంలో డయాబెటీస్ రోజు రోజుకి విస్తరిస్తోంది. ఈ సమస్యను సీరియస్‌గా తీసుకోకపోతే జీవితం సగంలోనే ముగుస్తుంది. ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం చాలా ప్రమాదకరం. ఈ కారణంగా కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది మాత్రమే కాదు వ్యక్తి కోమాలోకి వెళ్ళవచ్చు. అందుకే డయాబెటీస్ పేషెంట్లు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. షుగర్ లెవల్స్ అకస్మాత్తుగా పెరిగినట్లయితే శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. వీటిని అస్సలు విస్మరించకూడదు. అలాంటి లక్షణాల గురించి ఈరోజు తెలుసుకుందాం.
అస్పష్టమైన దృష్టి
రక్తంలో చక్కెర శాతం పెరిగినప్పుడు రోగికి చూపు మందగిస్తుంది. కళ్ల ముందు చీకట్లు కమ్ముకున్నట్లుగా ఉంటుంది. ఏదీ స్పష్టంగా కనిపించదు. గుండెపోటు సమయంలో కూడా ఇలానే జరుగుతుంది. అయితే పరిస్థితి ఏదైనప్పటికీ ఇలాంటి సమస్య ఉన్నప్పుడు అస్సలు విస్మరించవద్దు. వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.
అలసటగా ఉండటం
రక్తంలో చక్కెర శాతం పెరిగినప్పుడు అలసిపోయినట్లుగా అనిపిస్తుంది. ఈ లక్షణాన్ని అస్సలు విస్మరించవద్దు. వెంటనే షుగర్ లెవల్స్ చెక్ చేయాలి. వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
తీవ్రమైన తలనొప్పి
రక్తంలో చక్కెర శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఇది రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. శరీరానికి ఆక్సిజన్ సరిగ్గా పంపిణీ చేయదు. దీంతో తలనొప్పి తీవ్రంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో షుగర్ లెవల్స్ చెక్ చేసి డాక్టర్‌ని సంప్రదించాలి.
మూత్రం నుంచి దుర్వాసన
రక్తంలో చక్కెర శాతం పెరిగినప్పుడు రోగి మూత్రం నుంచి దుర్వాసన వస్తుంది. అలాంటి సమస్య ఎదురైనప్పుడు తప్పనిసరిగా షుగర్ లెవెల్ చెక్ చేసుకోవాలి. వెంటనే వైద్యుడిని సంప్రదించి సమస్యని వివరించాలి. తగిన మందులు వాడాలి.