Spices Benefits: ఈ మసాల దినుసులు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.. వర్షాకాలం డైట్‌లో ఉండాల్సిందే..!
Spices Benefits: వర్షాకాలం రోగాల సీజన్. అందుకే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. తినే తిండి నుంచి తాగే నీటివరకు అన్ని శుభ్రంగా ఉండాలి.
Spices Benefits: వర్షాకాలం రోగాల సీజన్. అందుకే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. తినే తిండి నుంచి తాగే నీటివరకు అన్ని శుభ్రంగా ఉండాలి. ఈ సీజన్‌లో శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే చాలామంది వ్యాధులకి గురవుతారు. ఈ సమయంలో రోగనిరోధక శక్తి పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఆహారంలో కొన్ని మసాల దినుసులని చేర్చాలి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అంతేకాదు చక్కటి రుచిని కూడా అందిస్తాయి. అలాంటి మసాల దినుసుల గురించి ఈరోజు తెలుసుకుందాం.
నల్ల మిరియాలు
నల్ల మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. నల్ల మిరియాలు జీవక్రియను పెంచుతాయి. దగ్గు, గొంతు నొప్పి ఉన్నట్లయితే నల్ల మిరియాలు తీసుకోవచ్చు. వీటిని నిద్రవేళకు ముందు వేడి పాలలో కలుపుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.
పసుపు
పసుపు ప్రతి ఇంటి వంటగదిలో ఉంటుంది. ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడుతాయి. రోజూ రాత్రిపూట పసుపు పాలు తాగాలి. ఇలా చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
లవంగం
లవంగం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి పని చేస్తుంది. వర్షాకాలంలో లవంగాలను తీసుకుంటే గొంతు నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
దాల్చిన చెక్క
దాల్చిన చెక్కలో అద్భుత ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తని పెంచడంలో సహాయపడుతుంది. డయాబెటీస్ పేషెంట్లకి రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. ప్రతిరోజు గ్లాసు పాలలో దాల్చిన చెక్క పొడి కలుపుకొని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు శరీరంలో ఉండే కొవ్వు శాతాన్ని తగ్గించే గుణం దీనిలో ఇమిడి ఉంది.