Weaken Immunity: ఈ అలవాట్లు ఇమ్యూనిటీకి శత్రువులు.. బాడీని బలహీనంగా మారుస్తాయి..!
Weaken Immunity: రోగనిరోధక శక్తి అనేది శరీరానికి చాలా అవసరం. లేదంటే వ్యాధులు ప్రబలే ప్రమాదం పెరుగుతుంది.
Weaken Immunity: రోగనిరోధక శక్తి అనేది శరీరానికి చాలా అవసరం. లేదంటే వ్యాధులు ప్రబలే ప్రమాదం పెరుగుతుంది. కరోనా సమయంలో ఇది చాలాసార్లు నిరూపితమైంది. అందుకే నేటి రోజుల్లో ప్రతి ఒక్కరూ ఇమ్యూనిటీ బలంగా ఉండాలని కోరుకుంటారు. ఇందుకోసం ఎలాంటి డైట్ పాటించాలి అనే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ చాలామంది ఇమ్యూనిటీని తగ్గించే విషయాలపై శ్రద్ధ చూపరు. నేటి కాలంలో ప్రజలు శరీరానికి హాని కలిగించే జంక్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారు. దీని కారణంగా కడుపు ఆరోగ్యం క్షీణించడమే కాకుండా రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. మీరు కూడా పదే పదే అనారోగ్యానికి గురవుతుంటే రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా మారిందని అర్థం చేసుకోండి. ఇలాంటి సమయంలో ఈ ఆహారపదార్థాలకు దూరంగా ఉండండి.
అధిక చక్కెర
ఒకరు చక్కెరకు ఎంతగా బానిస అవుతారంటే అది లేకుండా తలనొప్పికి గురవుతారు. టీ, కాఫీలు కాకుండా ప్రజలు కూల్‌డ్రింక్స్ ద్వారా చక్కెరను అధికంగా తీసుకుంటారు. దీనివల్ల శరీరంలో వాపు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇది ఊబకాయానికి దారి తీస్తుంది. చక్కెరను శుద్ధి చేయడం ద్వారా తయారుచేస్తారు. ఇది ఆరోగ్యానికి పెద్ద ముప్పు. చక్కెర రోగనిరోధక కణాలకు హాని కలిగిస్తుందని గుర్తుంచుకోండి.
కెఫిన్ అలవాటు
టీ లేదా కాఫీకి అలవాటు పడటం అనారోగ్యానికి గురిచేస్తుంది. వీటిలో ఉండే కెఫిన్ వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోయే ప్రమాదం పొంచి ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం అధిక కెఫిన్ శరీరానికి హాని కలిగిస్తుంది. నిద్రవేళకు 4 గంటల ముందు కెఫిన్ ఉన్న వాటిని తినకూడదు.
మద్యం అలవాటు
ఆల్కహాల్ వ్యసనం ప్రాణాంతకం అవుతుంది. ఆల్కహాల్‌కు బానిసలైనవారి కాలేయం బలహీనపడుతుంది. పొట్ట సంబంధిత సమస్యల వల్ల రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది. రోగనిరోధక శక్తిపై చెడు ప్రభావం కారణంగా తరచుగా అనారోగ్యానికి గురవుతారు. మద్యం లేదా సిగరెట్ అలవాటును వదులుకోవడానికి ప్రయత్నిస్తే ఉత్తమం.
జంక్ ఫుడ్
పెద్దలు లేదా పిల్లలు సాధారణంగా బయట తినడానికి ఇష్టపడతారు. ఆయిల్, స్పైసీ ఆహారాలు రుచికరంగా ఉంటాయి కానీ ఎక్కువగా తినడం వల్ల అనారోగ్యానికి గురవుతారు. ఫైబర్ లేని ప్రతిదానిలో పిండిని ఉపయోగిస్తారు. ఈ పరిస్థితిలో కడుపు బలహీనంగా మారుతుంది. దీని వల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీనపడి రకరకాల వ్యాధులు వస్తాయి.