Health Tips: ఈ పండ్లు పొట్టని శుభ్రం చేస్తాయి.. ఈ ఆరోగ్య సమస్యలకి చెక్..!
Health Tips: ఈరోజుల్లో జీవనశైలి సరిగ్గాలేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారం కారణంగా చాలామంది జీర్ణక్రియకి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు.
Health Tips: ఈరోజుల్లో జీవనశైలి సరిగ్గాలేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారం కారణంగా చాలామంది జీర్ణక్రియకి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. దీనివల్ల ఎసిడిటీ, గ్యాస్, మలబద్ధకం, కడుపు ఉబ్బరం, తిమ్మిర్లు వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇవన్ని ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తాయి. ఈ సందర్భంలో కొన్ని పండ్లు తినడం వల్ల పేగులు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇవి కడుపుని క్లీన్ చేసి, గ్యాస్ సమస్య నుంచి రక్షించగలవు. అలాంటి పండ్ల గురించి ఈరోజు తెలుసుకుందాం.
కివి
కివిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇందులో ఆక్టినిడిన్ ఎంజైమ్ ఉంటుంది. విటమిన్ సి ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. కివి కడుపుని శుభ్రపరుస్తుంది. ఇది పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది.
బొప్పాయి
బొప్పాయిలో ఫైబర్ ఉంటుంది. ఇది జీవక్రియను వేగవంతం చేయడానికి పనిచేస్తుంది. బొప్పాయి తినడం వల్ల పొట్ట శుభ్రపడుతుంది. అంతేకాదు ఆరోగ్యానికి అనేక ఇతర ప్రయోజనాలు లభిస్తాయి. ఇది చర్మానికి మేలు చేస్తుంది.
ఆరెంజ్
ఆరెంజ్ పండ్లు జీర్ణక్రియకు చాలా మంచివి. ఇది పేగులు, పొట్టకు సంబంధించిన సమస్యలను తొలగిస్తుంది. నారింజలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. ఆరెంజ్ ను జ్యూస్ లేదా సలాడ్ రూపంలో తీసుకోవచ్చు.
స్ట్రాబెర్రీలు
స్ట్రాబెర్రీలో ఫైబర్ ఉంటుంది. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి పని చేస్తాయి. అంతేకాదు ఇందులో విటమిన్ సి, ఫోలేట్ కూడా ఉంటుంది. స్ట్రాబెర్రీలు మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి.
పియర్
పియర్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఫైబర్, సార్బిటాల్, ఫ్రక్టోజ్ వంటి పోషకాలు ఉంటాయి. పియర్‌లో నీరు సమృద్ధిగా ఉంటుంది. ఇవి జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తాయి. ఇది మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. దీన్ని తినడం వల్ల పొట్ట శుభ్రంగా ఉంటుంది.