Diabetes Patients: షుగర్‌ పేషెంట్లకి ఈ పండ్లు దివ్యవౌషధం.. గ్లెసమిక్‌ ఇండెక్స్‌ చాలా తక్కువ..!

Diabetes Patients: భారతదేశంలో రోజు రోజుకి షుగర్‌ పేషెంట్లు పెరుగుతున్నారు.

Update: 2023-06-13 12:31 GMT

Diabetes Patients: షుగర్‌ పేషెంట్లకి ఈ పండ్లు దివ్యవౌషధం.. గ్లెసమిక్‌ ఇండెక్స్‌ చాలా తక్కువ..!

Diabetes Patients: భారతదేశంలో రోజు రోజుకి షుగర్‌ పేషెంట్లు పెరుగుతున్నారు. దీనికి కారణం జీవనశైలిలో మార్పులు రావడమే. సరైన డైట్‌ మెయింటెన్‌ చేయకుంటే రకరకాల వ్యాధులబారిన పడాల్సి వస్తుంది. ముఖ్యంగా నేటిరోజుల్లో ప్రతి 100 మందిలో 90 శాతం మందికి మధుమేహం ఉంటుంది. ఈ పరిస్థితిలో ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం, అధిక ప్రొటీన్లు, తక్కువ కేలరీలు ఉండే వాటిని డైట్‌లో చేర్చుకోవాలి. ఇది కాకుండా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్ని తినాలి. షుగర్‌ పేషెంట్లు కచ్చితంగా కొన్ని పండ్లని డైట్‌లో చేర్చుకోవాలి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

గ్లైసెమిక్ ఇండెక్స్

గ్లైసెమిక్ ఇండెక్స్ (జిఐ) అనేది ఒక రకమైన స్కేల్. దీని ద్వారా కొన్ని ఆహార పదార్థాలలో ఉండే కార్బోహైడ్రేట్ పరిమాణం, రక్తంలో గ్లూకోజ్ పరిమాణాన్ని కొలుస్తారు. అలాగే GI మొత్తం వంట పద్ధతులపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఎక్కువ కాలం వండిన ఆహారంలో GI సూచిక ఎక్కువగా ఉంటుంది.

1. చెర్రీ

చక్కెర రోగులు చెర్రీ పండ్లని డైట్‌లో చేర్చుకోవాలి. చెర్రీస్ GI కేవలం 20 మాత్రమే ఉంటుంది. కాబట్టి దీనిని ఆహారంలో సౌకర్యవంతంగా చేర్చుకోవచ్చు. అయితే అతిగా తినకూడదు. చెర్రీస్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి కానీ విటమిన్ సి, పొటాషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్‌లు పుష్కలంగా ఉంటాయి.

2. నారింజ పండ్లు

నారింజ పండ్లలో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు తరచుగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు. ఈ పండులో కేలరీలు తక్కువగా ఉంటాయి కానీ యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఆస్కార్బిక్ యాసిడ్, బీటా కెరోటిన్ ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇవి పనిచేస్తాయి.

3. యాపిల్

యాపిల్ పండ్లు తక్కువ జిఐని కలిగి ఉంటాయి. ఇందులో ఫ్రక్టోజ్, పాలీఫెనాల్స్, ఆంథోసైనిన్‌లు ఉంటాయి. ఈ ఆహారాలన్నీ డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఈ పండు తినడం వల్ల ఎముకలు, దంతాలు, చిగుళ్లు, జీర్ణశక్తి అన్నీ బాగుంటాయి. యాపిల్ అనారోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

Tags:    

Similar News