Radish Side Effects: ముల్లంగి తిన్న తర్వాత ఈ ఆహారాలు తినకూడదు.. చాలా ప్రమాదం..!
Radish Side Effects: ప్రజలు ముల్లంగి సలాడ్‌ను ఎంతో ఇష్టంతో తింటారు.
Radish Side Effects: ప్రజలు ముల్లంగి సలాడ్‌ను ఎంతో ఇష్టంతో తింటారు. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ముల్లంగిలో అనేక పోషకాలు ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఇది ప్రయోజనానికి బదులుగా హాని కలిగిస్తుంది. కొన్ని ఆహారాలతో కలిపి ముల్లంగి తినడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. ముల్లంగితో లేదా ముల్లంగి తిన్న తర్వాత ఏయే పదార్థాలు తినకూడదో ఈ రోజు తెలుసుకుందాం.
ముల్లంగి, దోసకాయ
ముల్లంగి, దోసకాయలు రెండింటినీ సలాడ్‌లో ఉపయోగిస్తారు. ముల్లంగితో దోసకాయ తినడం చాలా హానికరం. ఈ రెండింటిని కలిపి తినడం వల్ల చర్మ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
పొట్లకాయ, ముల్లంగి
ముల్లంగి సలాడ్‌ను కాకరకాయతో కానీ పొట్లకాయతో కానీ తినకూడదు. ముల్లంగిని చేదుతో కలిపి తింటే గుండె సంబంధిత సమస్యలు ఎదురవుతాయి.
ముల్లంగి, పాలు
పాలతో చేసిన వస్తువులను ముల్లంగితో కలిపి తినకూడదు. ముల్లంగి తిన్న తర్వాత పాల పదార్థాలను తినడం హానికరం. దీనివల్ల చర్మ సమస్యలు వస్తాయి.
నారింజ, ముల్లంగి
నారింజ, ముల్లంగి కలయిక మంచిది కాదు. నారింజతో ముల్లంగి తినడం వల్ల అనారోగ్యానికి గురవుతారు.
ముల్లంగి, టీ
ముల్లంగిని టీతో కలిపి తినడం వల్ల జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది. ముల్లంగి తర్వాత టీ తాగడం వల్ల ఎసిడిటీ సమస్యలు వస్తాయి.