Health Tips: ఫ్రిజ్‌లో పెట్టిన ఈ ఆహారాలు మళ్లీ మళ్లీ తింటున్నారా.. క్యాన్సర్‌ పేషెంట్లుగా మారుతారు జాగ్రత్త..!

Health Tips: మారుతున్న జీవనశైలి బిజీ షెడ్యూల్ కారణంగా జనాల ఆహారపు అలవాట్లలో విపరీతమైన మార్పులు వస్తున్నాయి.

Update: 2023-09-14 16:00 GMT

Health Tips: ఫ్రిజ్‌లో పెట్టిన ఈ ఆహారాలు మళ్లీ మళ్లీ తింటున్నారా.. క్యాన్సర్‌ పేషెంట్లుగా మారుతారు జాగ్రత్త..!

Health Tips: మారుతున్న జీవనశైలి బిజీ షెడ్యూల్ కారణంగా జనాల ఆహారపు అలవాట్లలో విపరీతమైన మార్పులు వస్తున్నాయి. చాలామంది రెడీ టు ఈట్‌ ఫుడ్స్‌ని తినడానికి ఇష్టపడుతున్నారు. ఇంకా కొన్నిసార్లు వండిన ఆహారాన్ని రిఫ్రిజిరేటర్‌లో రోజుల తరబడి స్టోర్‌ చేస్తూ కావాల్సినప్పుడు మళ్లీ మళ్లీ వేడి చేసుకుంటు తింటున్నారు. ఇలాంటి ఆహారం ఆరోగ్యానికి చాలా హానికరం. ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారాన్ని పదే పదే వేడి చేయడం వల్ల అందులో ఉండే పోషకాలు మొత్తం నశిస్తాయి. ఇది క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.

ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారపు అలవాట్లు పాటించాలి. చాలామంది చిన్న చిన్న విషయాలపై కూడా శ్రద్ధ చూపడం లేదు.ఈ నిర్లక్ష్యం కారణంగా భవిష్యత్‌లో పెద్ద వ్యాధులకు గురవుతున్నారు. ఆహారాన్ని రిఫ్రిజిరేటర్‌లో స్టోర్‌ చేసి తర్వాత వేడిచేసి తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కాబట్టి ఫ్రిజ్‌లో పెట్టిన ఎలాంటి ఆహారాలు వేడి చేసి తినకూడదో ఈ రోజు తెలుసుకుందాం.

నాన్ వెజ్

నాన్ వెజ్ ఫుడ్‌ని ఫ్రిజ్‌లో స్టోర్‌ చేసి తర్వాత వేడి చేసి తింటే ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది. అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

అన్నం

అందరికీ ఇష్టమైన ఆహారాలలో అన్నం ఒకటి. దీనిని ఎక్కువగా రాత్రిపూట ఫ్రిజ్‌లో పెట్టి ఉదయం వేడి చేసి తింటారు. ఇది మంచి పద్దతి కాదు. రిపోర్టు ప్రకారం అన్నాన్ని మళ్లీ మళ్లీ వేడి చేసి తింటే ఫుడ్ పాయిజన్ జరుగుతుందని తేలింది.

గుడ్డు

గుడ్లని ఆమ్లెట్ వేసుకొని, ఉడకబెట్టుకొని తింటారు. కొన్నిసార్లు వీటితో కూరలు కూడా వండుతారు. గుడ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే గుడ్లు వండిన వెంటనే తినడం మంచిది. ఫ్రిజ్‌లో పెట్టి వేడి చేసిన తర్వాత తినకూడదు. దీనివల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

ఆకుపచ్చ కూరగాయలు

ఆకుపచ్చ కూరగాయలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో నైట్రేట్ కూడా ఉంటుంది. ఇలాంటి కూరగాయలతో వండిన వంటకాలని పదేపదే వేడి చేసినప్పుడు అవి క్యాన్సర్ కారకాలను విడుదల చేస్తాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. అందుకే ఈ తప్పు అస్సలు చేయకూడదు.

Tags:    

Similar News