Health Tips: ఈ ఆహారాలు కంటిచూపుని పెంచుతాయి.. ఈరోజే డైట్‌లో చేర్చుకోండి..!

Health Tips: శరీరంలో కళ్ళు చాలా ముఖ్యమైన అవయవాలు. వీటిని కాపాడుకోవడం చాలా అవసరం.

Update: 2023-05-27 05:36 GMT

Health Tips: ఈ ఆహారాలు కంటిచూపుని పెంచుతాయి.. ఈరోజే డైట్‌లో చేర్చుకోండి..!

Health Tips: శరీరంలో కళ్ళు చాలా ముఖ్యమైన అవయవాలు. వీటిని కాపాడుకోవడం చాలా అవసరం. కళ్లలో కొంచెం దుమ్ము పడినా తల్లడిల్లిపోతాం. గంటలు గంటలు మొబైల్ చూడటం, కంప్యూటర్‌పైన గడపటం, ఎండలో సన్ గ్లాసెస్ పెట్టుకోకపోవడం, హెల్తీ డైట్ తీసుకోకపోవడం వల్ల కళ్లపై చెడు ప్రభావం పడుతుంది. అందుకే కళ్ల ఆరోగ్యానికి సంబంధించి కొన్ని రకాల ఆహారాలని డైట్‌లో చేర్చుకోవాలి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

1. బచ్చలికూర

ఆకుకూరలలో బచ్చలికూర చాలా పోషక విలువలు కలిగి ఉంటుంది.

ఇందులో ఉండే విటమిన్ ఎ కంటి చూపును పెంచడంలో బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే కొన్ని యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యకరమైన దృష్టికి అవసరమవుతాయి. అందుకే దీన్ని రెగ్యులర్‌గా తినడం మంచిది.

2. క్యారెట్

క్యారెట్‌ సూపర్‌ఫుడ్‌ అని చెప్పవచ్చు. ఇందులో ఉండే బీటా కెరోటిన్, విటమిన్ ఎ రేచీకటి ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. కంటి చూపుని మునుపటి కంటే మెరుగ్గా చేస్తుంది.

3. ఫ్యాటీ ఫిష్

సాల్మన్, ట్యూనా వంటి ఫ్యాటీ ఫిష్ కంటికి చక్కని ఔషధంగా చెప్పవచ్చు. ఇది రెటీనా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే పొడి కళ్లు, కంటిశుక్లం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

4. గుడ్లు

మనలో చాలా మంది అల్పాహారంగా గుడ్లు తినడానికి ఇష్టపడతారు. ఇందులో ప్రొటీన్‌ ఎక్కువగా లభిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ E, లుటిన్, జింక్ కళ్ళకు అన్ని విధాలుగా ప్రయోజనం చేకూరుస్తాయి. రోజూ 2 గుడ్లు తింటే కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

Tags:    

Similar News