Liver Health: ఈ ఆహారాలు లివర్‌కి మిత్రులు.. డైట్లో చేర్చుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు..!
Liver Health: మానవ శరీరంలో లివర్ ప్రధాన అవయవం. ఇది శరీరంలో చాలా రకాల పనులు జరగడానికి సహకరిస్తుంది.
Liver Health: మానవ శరీరంలో లివర్ ప్రధాన అవయవం. ఇది శరీరంలో చాలా రకాల పనులు జరగడానికి సహకరిస్తుంది. కానీ కొన్ని చెడు అలవాట్ల వల్ల ఇది దెబ్బతింటుంది. దీంతో సరిగ్గా పనిచేయక లివర ఫెయిల్యూర్ జరుగుతుంది. అందుకే లివర్ ఆరోగ్యం కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంటుంది. కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల లివర్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. అందుకే వీటిని కచ్చితంగా డైట్లో చేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే వెజ్‌తో పాటు నాన్‌వెజ్ కూడా అవసరమే. వెజ్‌లో ఆకు కూరలు, కాయ కూరలను ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా బచ్చలికూర వంటి ఆకుకూరలో క్లోరోఫిల్ ఎక్కువగా ఉంటుంది. ఇది డిటాక్సేషన్ కోసం అలాగే లివర్ పనితీరుని మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుంది. ఇవే కాక కూరగాయల్లోని యాంటీఆక్సిడెంట్లు శరీరానికి చాలా మేలు చేస్తాయి. బ్రోకలి లివర్‌లోని విష పదార్థాలను తొలగిస్తుంది. ఇందులో గ్లూకోసినోలేట్స్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఆహారంలోని హానికరమైన పదార్థాలను విచ్ఛిన్నం చేసి లివర్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
గుమ్మడి, పుచ్చకాయ విత్తనాలు, బాదం, జీడిపప్పు, వాల్నట్స్ వంటివి తీసుకోవడం వల్ల కూడా లివర్‌కి మంచి జరుగుతుంది. వీటిల్లోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి లివర్ పనితీరుని మెరుగుపరుస్తాయి. వెల్లుల్లి లివర్ని కాపాడుతుంది. ఇందులోని ఉండే సల్ఫర్ సమ్మేళనాలు కాలేయ ఎంజైములను సక్రియం చేసి టాక్సిన్స్‌ను తొలగిస్తాయి. చేపల్లోని కొవ్వు లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. సాల్మన్, సార్డినెస్ చేపల్లో ఓమేగా 3 పుష్కలంగా ఉంటుంది. ఇది లివర్ ఆరోగ్యానికి అత్యంత అవసరమయ్యే పోషకం. అందుకే అప్పుడప్పుడు చేపలు కూడా తినాలి.