Tourism Places In Anantapur: అనంతపురం వెళ్తున్నారా? ఈ పర్యాటక ప్రాంతాలను చూడటం మరవద్దు

Tourism Places In Anantapur: ప్రకృతి అందాలను ఆస్వాదించాలని అందరూ కోరుకుంటారు. సహజసిద్ధంగా ఏర్పడ్డ అందాలని తిలకించి ఆనందించాలని అందరికీ ఉంటుంది. రోజూ జరిగే జీవన పోరాటంలో విశ్రాంతి తీసుకున్నా..కాస్త సేదా తీరాలనుకున్నా..అందరికీ పర్యాటక ప్రదేశాలను చిరునామాగా మారుతాయి. అలాంటివి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతరంపురంలో చాలా ఉన్నాయి. జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్లాలని అనిపించే చూడదగ్గ ప్రాంతాలు ఉన్నాయి. మరి అలాంటి ప్రాంతాలు ఏవో మీరూ తెలుసుకోండి.

Update: 2024-07-25 07:15 GMT

Tourism Places Anantapur: అనంతపురం వెళ్తున్నారా? ఈ పర్యాటక ప్రాంతాలను చూడటం మరవద్దు

Anantapur Tourist Places:పర్యాటక రంగాన్ని ఇష్టపడనివారంటూ ఉండరు. చిన్న నుంచి పెద్దల వరకు కొత్త ప్రాంతాలు, ప్రదేశాలకు తిరగడం అంటే చాలా ఇష్టం ఉంటుంది. కొందరు అదే పనిగా పర్యటిస్తుంటారు. ఇంకొందరు సందర్భాన్ని బట్టి వెళ్తుంటారు. ఒత్తిడిసమయంలో ఉపశమనం కోసం విహార యాత్రలకు వెళ్లేవారు కూడా ఉంటారు. రొటిన్ లైఫ్ నుంచి వెరైటీ కోరుకునే వారికి ఇవి మంచి ప్రదేశాలు అని చెప్పవచ్చు. అలాంటి పర్యాటక ప్రాంతాలు ఏపీలోని అనంతపురం జిల్లాలో కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం.

పెన్నా అహోబిలం:

పెన్నా అహోబిలం పట్టణం అనంతపురంలో ప్రసిద్ధి చెందినది. ఇక్కడ నరసింహ స్వామికి అంకితం చేసిన దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో నరసింహస్వామి సింహం తల, మానవ శరీరంతో విష్ణుమూర్తి అవతారంలో ఉంటారు. ఈ దేవాలయాన్ని సందర్శించేందుకు ఏడాది పొడవునా పెద్ద సంఖ్యలో ప్రజలు పెన్నా అహోబిలానికి వస్తుంటారు. ఇది దాదాపు 2800 సంవత్సరాల పురాతనమైన దేవాలయం. ఇది విజయనగర నిర్మాణ శైలిలో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.

లేపాక్షి:

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో లేపాక్షిలో ఉన్న ఈ వీరభద్ర దేవాలయం బెంగళూరు ప్రజలకు ఇష్టమైన చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశం. బెంగళూరు ప్రజలే కాదు దేశం నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడి వస్తుంటారు. ఇక్కడ పవిత్రమైన వీరభద్ర దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో నిర్మించారు. వీరభద్ర దేవాలయం లోపలి, వెలుపలి గోడలు అందమైన శిల్పాలు, కుడ్యచిత్రాలతో అలంకరించి ఉంటాయి. ఆలయం మొత్తం ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరిచే స్తంభం ఇక్కడ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక్క స్తంభం మాత్రం నేలపై నిలబడకుండా గాలిలో వేలాడే స్థితిలో ఉంది. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు స్తంభం ఎంతగానో ఆకట్టుకుంటుంది.

పెనుకొండ కోట:

ఈ పెనుకొండ కోటను హోయసల రాజవంశీయులు నిర్మించారు. విజయనగర నిర్మాణ శైలిలో నిర్మించిన ఈ కోట జైనులకు పవిత్ర స్థలం. ఇక్కడ పాచే పార్శవనాథ స్వామి ఆలయం ఉంది. జైన దేవాలయంతో పాటు, ఈ ప్రాంతంలో హిందూ దేవాలయాలు, మసీదు కూడా ఉన్నాయి.పెనుకొండ ఆలయం ఏడాది పొడవునా పర్యటనలకు తెరిచి ఉంటుంది. ఇది అనంతపురంలో చాలా ప్రసిద్ధి చెందిన ప్రదేశం కావడంతో చాలా మంది ఇక్కడికి వస్తుంటారు.

ఎలా వెళ్లాలి:

హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా అనంతపురంకు వెళ్లవచ్చు. సొంత వాహనాలు ఉన్నవారు మరింత సులభంగా ప్రయాణించవచ్చు. లేదంటే రైలు మార్గం కూడా ఉంది. హైదరాబాద్ నుంచి కేవలం 4 నుంచి 5 గంటల్లో అనంతపురం పురం చేరుకోవచ్చు.

Tags:    

Similar News