Fatty Liver: శరీరంలో ఈ లక్షణాలున్నాయా.? ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నట్లే
ఫ్యాటీ లివర్ కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
శరీరంలో లివర్ ఎంత ముఖ్యమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే లివర్ ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తీసుకునే ఆహారంలో మార్పులు, జీవన విధానంలో మార్పుల కారణంగా లివర్ ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణులు చెబుతుంటారు. ఫ్యాటీ లివర్ కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. శరీరంలో కనిపించే కొన్ని ముందస్తు లక్షణాల ఆధారంగా ఫ్యాటీ లివర్ సమస్యను గుర్తించవచని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* శరీంలో కనిపించే వాపు ఫ్యాటీ లివర్‌కు ముందస్తు సంకేతం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు ముఖంపై వాపు కనిపిస్తే ఫ్యాటీ లివర్ అని భావించాలి. ఫ్యాటీ లివర్ సమస్య ఉంటే శరీరంలోని అవయవాలు ప్రోటీన్ తయారీ సామర్ధ్యంపై ప్రభావం పడుతుంది. రక్త సరఫరా సక్రమంగా సాగదు దీంతో వాపు వస్తుంది.
* ఫ్యాటీ లివర్ కారణంగా కంటిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కళ్లు పసుపు రంగులోకి మారుతాయి. సాధారణంగా పచ్చ కామెర్లు వచ్చిన సమయంలో కనిపించిన విధానంగానే కళ్లు పచ్చగా మారుతాయి.
* ఫ్యాటీ లివర్ కారణంగా చర్మంపై దురద వస్తుంది. శరీరంలో ఉప్పు ఎక్కువైతే ఇలాంటి పరిస్థితి వస్తుంది. దీనికి కూడా ఫ్యాటీ లివర్ కారణమని నిపుణులు చెబుతున్నారు.
* ఫ్యాటీ లివర్ వల్ల రోసౌసియా అనే చర్మ సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల చర్మంపై ఎర్రటి మచ్చలు కన్పిస్తాయి. అలాగే చర్మం రంగు సైతం మారుతుంది. ఫ్యాటీ లివర్ కారణంగా ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. ఇన్సులిన్ ఉపయోగం సరిగ్గా ఉండదు. ఇన్సులిన్ తయారీ అధికం కావడం వల్ల చర్మం రంగు మారుతుంది.