Brain Cancer: స్మార్ట్ ఫోన్లకు, బ్రెయిన్ క్యాన్సర్ కు ఎలాంటి లింక్ లేదు.. WHO అధ్యయనంలో వెల్లడి

Brain Cancer: సాధారణంగా స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడితే బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని చాలామంది హెచ్చరిస్తూ ఉంటారు. దీంతో చాలామంది మొబైల్ ఫోన్ మీ తల సమీపంలో పెట్టుకొని పడుకుంటే కూడా ప్రమాదకరమైన వంటి జబ్బులు వస్తాయని హెచ్చరిస్తూ ఉంటారు. అయితే వీటిపై ఒక సమగ్ర అధ్యయనం అనేది ఒకటి వెలువడింది.

Update: 2024-09-04 02:30 GMT

Brain Cancer: స్మార్ట్ ఫోన్లకు, బ్రెయిన్ క్యాన్సర్ కు ఎలాంటి లింక్ లేదు.. WHO అధ్యయనంలో వెల్లడి

Brain Cancer: సాధారణంగా స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడితే బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని చాలామంది హెచ్చరిస్తూ ఉంటారు. దీంతో చాలామంది మొబైల్ ఫోన్ మీ తల సమీపంలో పెట్టుకొని పడుకుంటే కూడా ప్రమాదకరమైన వంటి జబ్బులు వస్తాయని హెచ్చరిస్తూ ఉంటారు. అయితే వీటిపై ఒక సమగ్ర అధ్యయనం అనేది ఒకటి వెలువడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక అధ్యయనంలో కొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా మొబైల్ ఫోన్ వినియోగానికి , మెదడు క్యాన్సర్ వచ్చే ప్రమాదానికి మధ్య ఎటువంటి సంబంధం లేదని తెలిపింది.ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ప్రచురితమైన అనేక రీసెర్చ్ పేపర్లను సైతం అధ్యయనం చేసి ఈ విషయం వెల్లడించినట్లు సదరు సంస్థ తెలిపింది.

వైర్‌లెస్ టెక్నాలజీ వినియోగంలో భారీ పెరుగుదల ఉన్నప్పటికీ, మెదడు క్యాన్సర్ కేసుల్లో తగిన పెరుగుదల లేదని అధ్యయనం తేల్చింది, మంగళవారం ప్రచురించిన సమీక్షలో కొన్ని కొత్త విషయాలు కనుగొంది. సుదీర్ఘ ఫోన్ కాల్స్ చేసే వ్యక్తులకు లేదా ఒక దశాబ్దం కంటే ఎక్కువ కాలం పాటు మొబైల్ ఫోన్‌లను ఉపయోగించిన వారిపై కూడా కొన్ని పరీక్షలు నిర్వహించారు.

మొబైల్ ఫోన్ వాడకం అలాగే మెదడుపై ప్రభావం పై 1994-2022 వరకు 63 అధ్యయనాలు ఉన్నాయి, ఆస్ట్రేలియన్ ప్రభుత్వం రేడియేషన్ ప్రొటెక్షన్ అథారిటీతో సహా 10 దేశాల నుండి 11 మంది పరిశోధకులచే అంచనా వేయించింది.

మొబైల్ ఫోన్‌లతో పాటు టీవీ, బేబీ మానిటర్లు, రాడార్‌లలో ఉపయోగించే రేడియో ఫ్రీక్వెన్సీ ప్రభావాలను అంచనా వేసింది , న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ విశ్వవిద్యాలయంలో క్యాన్సర్ ఎపిడెమియాలజీ ప్రొఫెసర్ సహ రచయిత మార్క్ ఎల్‌వుడ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. వీటిలో ప్రధానంగా మొబైల్ ఫోన్ వాడటం వల్ల, పెద్దగా పెరిగిన జబ్బులు ఏమీ లేవని వెల్లడించాడు. అలాగే పెద్దలు, పిల్లలలో మెదడుకు సంబంధించిన క్యాన్సర్‌లలో, అలాగే పిట్యూటరీ గ్రంధి, లాలాజల గ్రంథులు, లుకేమియా క్యాన్సర్లలో కూడా, మొబైల్ ఫోన్ వినియోగం, బేస్ స్టేషన్‌లు, ట్రాన్స్‌మిటర్‌లు, వంటి వైర్ లెస్ సాధానల వినియోగంలో ప్రమాదాలను పరిశీలించింది.

డబ్ల్యూహెచ్‌ఓ, ఇతర అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు మొబైల్ ఫోన్‌లు ఉపయోగించే రేడియేషన్ నుండి ప్రతికూల ఆరోగ్య ప్రభావాలకు ఖచ్చితమైన ఆధారాలు లేవని గతంలో సైతం చెప్పాయి ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARC) చే ఇది ప్రస్తుతం క్లాస్ 2B క్యాన్సర్ కారకంగా వర్గీకరించింది. ఇదిలా ఉంటే మొబైల్ ఫోన్ల వినియోగం వల్ల బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందని కచ్చితంగా కారణాలు చెప్పలేమని ఇలాంటి అధ్యయనమే గతంలో కూడా వెలువడింది.

Tags:    

Similar News