Milk And Dates: పాలు, ఖర్జూరంతో అద్భుత శక్తి.. ఈ 4 వ్యాధులకి దివ్యవౌషధం..!
Milk And Dates: ఈ వేగవంతమైన జీవితంలో చాలామంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.
Milk And Dates: ఈ వేగవంతమైన జీవితంలో చాలామంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. దీంతో రకరకాల ఆరోగ్య సమస్యలని ఎదుర్కొంటున్నారు. నిత్యం ఏదో ఒక కారణంతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. వాస్తవానికి చాలామంది శారీరక బలహీనతకి గురైనప్పుడు వ్యాధుల బారినపడుతారు. అందుకే రోజువారీ డైట్‌లో కచ్చితంగా కొన్ని పోషక విలువలు ఉండే ఆహారాలని చేర్చుకోవాలి. ఈ రోజు పాలు, ఖర్జూరం గొప్పతనం గురించి తెలుసుకుందాం.
పాలు, ఖర్జూరం ప్రయోజనాలు
పాలు, ఎండు ఖర్జూరంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఖర్జూరంలో కాల్షియం, పీచు, జింక్, మెగ్నీషియం, ఐరన్ లభిస్తాయి. ఇది కాకుండా విటమిన్లు A, C, E, K, B2, B6, నియాసిన్, థయామిన్ ఉంటాయి. ఇవి పురుషులలో శక్తిని పెంచుతాయి. మరోవైపు పాలలో ఉండే కాల్షియం, సోడియం, పొటాషియం శరీరానికి శక్తిని అందిస్తాయి.
తొందరగా బరువు పెరుగుతారు
తక్కువ బరువు ఉన్న వ్యక్తులకు ఈ పానీయం చాలా బెస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు పెరగడానికి సహాయపడుతుంది. అందుకే జిమ్ ట్రైనర్లు బరువు పెరగడానికి ఎండిన ఖర్జూరాలను తినమని సూచిస్తారు.
రక్తహీనత నివారణ
ఎండు ఖర్జూరం, పాలు కలిపి తీసుకోవడం వల్ల రక్తహీనత నుంచి రక్షించుకోవచ్చు. ఈ వ్యాధి గర్భధారణ సమయంలో సంభవిస్తుంది. ఈ పరిస్థితిలో శరీరంలో రక్తం లేకపోవడం, త్వరగా అలసిపోవడం జరుగుతుంది. ఖర్జూరంలో ఉండే ఐరన్ రక్తం ఏర్పడటానికి సహాయపడుతుంది. అందుకే గర్భిణీలు ఖర్జూరాన్ని తినమని వైద్యులు సలహా ఇస్తారు.
ఆస్తమా రోగులకు మేలు
మీరు శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతుంటే ఖర్జూరం, పాలు కలిపి తీసుకోవాలి. దీనివల్ల శ్వాసకోశ వ్యవస్థ బాగుపడుతుంది. ఆస్తమా రోగులకు పాలు, ఖర్జూరాలు చాలా ప్రయోజనకరంగా పనిచేస్తాయి.
సంతానోత్పత్తి
శారీరక బలహీనత, లైంగిక సమస్యలతో బాధపడుతున్న పురుషులకు పాలు, ఖర్జూరాల వినియోగం ప్రభావవంతంగా ఉంటుంది. ఈ రెండు పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పురుష శక్తి పెరుగుతుంది. ఖర్జూరంలో టెస్టోస్టిరాన్ హార్మోన్‌ను పెంచే గుణం ఉంటుంది. ఇది పురుషుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఖర్జూరాన్ని పాలలో వేసి మరిగించి రాత్రి పడుకునే ముందు తాగాలి. మంచి శక్తి లభిస్తుంది.