Water Intoxication: శరీరానికి నీరు అవసరమే.. కానీ ఈ సందర్భాలలో చాలా ప్రమాదకరం..!
Water Intoxication: శరీరంలో ఎక్కువ శాతం నీరు మాత్రమే ఉంటుంది. ఇది చాలా అవసరం లేదంటే లోపల ఎలాంటి పనులు జరగవు.
Water Intoxication: శరీరంలో ఎక్కువ శాతం నీరు మాత్రమే ఉంటుంది. ఇది చాలా అవసరం లేదంటే లోపల ఎలాంటి పనులు జరగవు. అయితే నీరు తాగే విషయంలో కొన్ని పరిమితులు ఉన్నాయి. వాటిని కచ్చితంగా పాటించాలి. లేదంటే చాలా ప్రమాదం జరుగుతుంది. సాధారణంగా శరీరంలో నీటి అసమతుల్యత ఏర్పడినప్పుడు ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. ముఖ్యంగా ఓవర్‌హైడ్రేషన్, డీహైడ్రేషన్ రెండూ శరీరానికి హాని కలిగిస్తాయి. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం.
ఓవర్ హైడ్రేషన్ అంటే ఏంటి..?
వాటర్ ఇంటాక్సికేషన్ లేదా ఓవర్ హైడ్రేషన్ అంటే ఒక వ్యక్తి ఎక్కువ నీరు తీసుకున్నప్పుడు సంభవించే పరిస్థితి. ఇది రక్తప్రవాహంలో అవసరమైన ఎలక్ట్రోలైట్‌లను పలుచన చేస్తుంది. దీనివల్ల శరీరంలో వివిధ ప్రతికూలతలు మొదలవుతాయి. తలనొప్పి, వికారం, కళ్లు తిరగడం వాంతులు, మూర్ఛలు, తీవ్రమైన సందర్భాల్లో కోమా వంటి అనారోగ్యానికి దారితీస్తుంది. తక్కువ సమయంలో ఎక్కువ నీరు తాగడం వల్ల ఇది సంభవిస్తుంది. సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాలు పోయే పరిస్థితులు ఏర్పడుతాయి.
డీహైడ్రేషన్ అంటే ఏంటి..?
శరీరం ఎక్కువ ద్రవాలను కోల్పోయినప్పుడు డీహైడ్రేషన్ సంభవిస్తుంది. దీనివల్ల శారీరక విధులకు సాయం చేయడానికి తగినంత నీరు ఉండదు. విపరీతమైన చెమట, విరేచనాలు, వాంతులు, తగినంత నీరు తాగకపోవడం వంటి కారణాల వల్ల డీ హైడ్రేషన్ సంభవిస్తుంది. దీనివల్ల దాహం, గొంతు పొడిబారడం, మైకం, అలసట ఏర్పడుతాయి. తీవ్రమైన డీహైడ్రేషన్ మూత్రపిండాల వైఫల్యం, ఇతర ప్రాణాంతక సమస్యలను కలిగిస్తుంది. పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకు ముప్పు ఎక్కువగా ఉంటుంది.