Bonalu Special Mutton Curry: తెలంగాణ బోనాలు స్పెషల్ రెసిపీ..మటన్ కర్రీ ఇలా చేస్తే ముక్క మిగలదు

Bonalu Special Mutton Curry:తెలంగాణలో దావత్ అంటే ముక్క, సుక్క ఉండాల్సిందే. ఈ రెండూ లేకుంటే అసలు దావత్ లాగే అనిపించదు. ఫంక్షన్ ఏదైనా కావచ్చు..మటన్, చికెన్ ఉండాల్సిందే. అసలు ముక్క లేనిదే బుక్క దిగదు. మరి ఆషాడం మాసం బోనాలు షురూ అయ్యాయంటే..ఏ ఊరెళ్లినా, ఏ గల్లికి పోయినా మటన్ ఘుమఘమలు నోట్లో నీళ్లూరిస్తాయి. తెలంగాణ బోనాలు స్పెషల్ మటన్ కర్రీ ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం.

Update: 2024-07-06 08:54 GMT

Bonalu Special Mutton Curry: తెలంగాణ బోనాలు స్పెషల్ రెసిపీ..మటన్ కర్రీ ఇలా చేస్తే ముక్క మిగలదు

Bonalu Special Mutton Curry:తెలంగాణలో పండగలు, ఫంక్షన్లు, దావతులు ఇలా సందర్భం ఏదైనా సరే మేకలు, గొర్రెల తలలు తెగాల్సిందే. మటన్ ముక్క లేనిది దావత్ ఉండదంటే ఆశ్చర్యపోవాల్సిందే. మటన్ తో మందు ఉంటే ఆ సందడే వేరు. ఇక ఆషాడ మాసంలో ఈ రెండింటి కాంబినేషన్ అదిరిపోతుంది. ప్రతి ఇంట్లోనూ మటన్ కర్రీ వాసనలు నోరూరిస్తాయి.మరి ఇంత ప్రాముఖ్యత ఉన్న మటన్ రెసీపీ ఎలా తయారు చేస్తారో తెలుసుకుందామా?

కావాల్సిన పదార్థాలు

మటన్- అరకిలో ( మీకు కావాలంటే ఎంతైనా తీసుకోవచ్చు. మేము అరకిలోకు కావాల్సిన వస్తువులు తీసుకుంటున్నాము)

పసుపు - పావు టీ స్పూన్

ఉపు-రుచికి సరిపడినంతా

కారం- 1 టీస్పూన్ ( ఎక్కువ స్పైసీ కావాలనుకునేవాళ్లు ఇంకొంచెం కలుపుకోవచ్చు)

నూనె లేదా నెయ్యి -1 టేబుల్ స్పూన్

నిమ్మరసం - 1 టీస్పూన్

మటన్ ఫ్రై కంటే గ్రేవీ బాగుంటుంది. కాబట్టి గ్రేవీ కోసం కావాల్సిన పదార్ధాలు

కొబ్బరి తురుము -2 టేబుల్ స్పూన్లు

దాల్చిన చెక్క - 2 ఇంచులు

అనాస పువ్వు -1

యాలకులు -2

లవంగాలు -4

బిర్యానీ ఆకు-1

మిరియాలు-హాఫ్ టీస్పూన్

ధనియాలు -2 టీస్పూన్లు

గసగసాలు -1 టీస్పూన్

నువ్వులు-2 టీ స్పూన్లు

జీడిపప్పు -5

ఎండు మిర్చి -5

కర్రీ కోసం:

నూనె - 2 టేబుల్ స్పూన్లు

జీలకర్ర - అర టీస్పూన్

పచ్చిమిర్చి - 2

కరివేపాకు - 1 రెబ్బ

ఉల్లిపాయలు - 2 మీడియం సైజువి

అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు

కొత్తిమీర - 1 చిన్న కట్ట

పుదీనా - 10 ఆకులు

తయారీ విధానం:

ముందుగా ఒక బౌల్లోకి మటన్ తీసుకుని దానిని శుభ్రం చేసుకోవాలి. తర్వాత అందులో పసుపు, కారం, నిమ్మరసం, నూనె, ఉప్పు వేసుకుని బాగా కలపాలి. ఓ అరగంటపాటు పక్కన పెట్టాలి. అరగంట పక్కన పెడితే ఆ మసాలాలు అన్నీ మటన్ కు బాగా పడుతుంది. ఇప్పుడు మసాల కోసం జార్ లో కొబ్బరి తురుము, దాల్చి చెక్క, అనాసపువ్వు, యాలకులు, లవంగాలు,బిర్యానీ ఆకు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, గసగసాలు, నువ్వులు, జీడిపప్పు, ఎండు మిర్చి వేసి గ్రైండ్ చేసుకోవాలి. అందులో కొంచెం నీళ్లు పోస్తే పేస్టులా తయారు అవుతుంది.

ఇప్పుడు స్టౌ వెలిగించి కుక్కర్ పెట్టి..వేడెక్కిన తర్వాత నూనె వేసి జీలకర్ర వేయాలి. పచ్చిమిర్చి సన్న తరిగి వేయాలి. కరివేపాకు ఉల్లిపాయలు వేసి ఓ రెండు నిమిషాలు వేయించుకోవాలి. దానిలో అల్లం వెల్లుల్లి పేస్టు వేసి సన్నని మంటమీద వేయించుకోవాలి. ఇందులో మారినెట్ చేసుకున్న మటన్ వేయాలి. వాటిని కలిపి..కుక్కర్ మూత పెట్టాలి. 10 నిమిషాలు ఉడికించాలి. మధ్య మధ్యలో తిప్పుతుండాలి. పది నిమిషాల తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి మరోసారి కలపాలి.

ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న పేస్టును కర్రీలో వేసి బాగా కలపాలి. ఇప్పుడు దానిని ఐదు నిమిషాలు తిప్పుతుండాలి. మసాలాకాస్త..నూనెలు ఫ్రై అవుతుంది. ఇలా చేస్తే పచ్చివాసన పోతుంది. గ్రేవి ఉడికి ఆయిల్ పైకి తేలుతుంది. మసాలా పేస్టు వేగిన తర్వాత దానిలో కాస్త నీళ్లు పోయాలి. దానిలో సాల్ట్ వేసి కలిపి అది సరిపోయిందలో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూతపెట్టి దానిని 8 నుంచి 10 విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి. కుక్కర్ ప్రెజర్ అంతా పోయేవరకు వేచి చూడాలి. మూత తీసి టేస్టు చూసి రోటితోకానీ..అన్నంతో తినవచ్చు. 

Tags:    

Similar News