Health Tips: కంటిచూపు పెరగాలని ఇది ఎక్కువగా తీసుకుంటే చాలా ప్రమాదం.. అదేంటంటే..?

Health Tips: శరీరానికి అవసరమైన పోషకాలలో విటమిన్‌ ఎ టాప్‌ లిస్టులో ఉంటుంది.

Update: 2023-04-03 15:00 GMT

Health Tips: కంటిచూపు పెరగాలని ఇది ఎక్కువగా తీసుకుంటే చాలా ప్రమాదం.. అదేంటంటే..?

Health Tips: శరీరానికి అవసరమైన పోషకాలలో విటమిన్‌ ఎ టాప్‌ లిస్టులో ఉంటుంది. ఎందుకంటే ఇది నేరుగా మన కళ్ళని ప్రభావితం చేస్తుంది. విటమిన్‌ ఎ అధికంగా ఉండే ఆహారం తింటే కంటి చూపు మెరుగుపడుతుంది. అలాగే రేచీకటి సమస్య తొలగిపోతుంది. అయితే విటమిన్ ఎ ఆధారిత ఆహారాన్ని అధికంగా తీసుకోవడం కూడా చాలా ప్రమాదకరమని అనేక పరిశోధనలలో తేలింది. అది ఎలాగో తెలుసుకుందాం.

విటమిన్ ఎ ఆహారాలు

విటమిన్ ఎ లోపం ఉన్నవారు బత్తాయి, బొప్పాయి, పెరుగు, సోయాబీన్, గుడ్డు, పాలు, క్యారెట్, బచ్చలికూరలు క్రమం తప్పకుండా తీసుకోవాలి. కానీ దీనికి కూడా పరిమితి ఉంటుంది. విటమిన్ ఎ ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి కొన్ని నష్టాలు జరుగుతాయి. విటమిన్ ఎ కళ్ళకు మంచిదే అయినప్పటికీ పరిమితికి మించి తీసుకుంటే కళ్ళు అస్పష్టంగా కనిపిస్తాయి. అధిక మొత్తంలో విటమిన్ ఎ ఆహారం కారణంగా డయేరియా వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు. అందువల్ల డైటీషియన్ సలహాపై పరిమితంగా తీసుకోవాలి.

విటమిన్ ఎ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకలు, కీళ్లలో నొప్పి వస్తుంది. కాబట్టి మధ్య వయస్కులు, వృద్ధులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మహిళల్లో విటమిన్ ఎ ఎక్కువగా ఉండటం మంచిది కాదు. ఎందుకంటే ఇది క్రమరహిత పీరియడ్స్‌కు కారణమవుతుంది. ఏదైనా అతిగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. విటమిన్ ఎ అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల అలసట, బలహీనత సమస్యలు ఎదురవుతాయి. జుట్టు బలహీనంగా మారుతుంది. బట్టతల వచ్చే ప్రమాదం ఉంటుంది.

Tags:    

Similar News