Hormones Imbalanced: హార్మోన్స్‌లో తేడా వస్తే ఈ ఫుడ్స్‌ తినండి.. త్వరగా సెట్‌ అవుతారు..!

Hormones Imbalanced: ఆధునిక జీవనశైలిలో చాలామందిలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది.

Update: 2023-07-05 14:08 GMT

Hormones Imbalanced: హార్మోన్స్‌లో తేడా వస్తే ఈ ఫుడ్స్‌ తినండి.. త్వరగా సెట్‌ అవుతారు..!

Hormones Imbalanced: ఆధునిక జీవనశైలిలో చాలామందిలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. దీనివల్ల చాలా అనారోగ్య సమస్యలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే హార్మోన్ అనేది శరీరంలో తయారయ్యే ఒక రసాయన పదార్థం. ఇది రక్తంలోకి చేరి శరీరమంతా వ్యాపిస్తుంది. హార్మోన్ అసమతుల్యత ఏర్పడినప్పుడు శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా నిద్రలేమి, జీర్ణక్రియ సరిగా జరగకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే హార్మోన్ అసమతుల్యతకు చాలా కారణాలు ఉంటాయి. ఇలాంటి సమయంలో ఎలాంటి ఆహారాలు తీసుకుంటే సెట్‌ అవుతారో ఈరోజు తెలుసుకుందాం.

అవిసె గింజలు

అవిసె గింజలు శరీరానికి చాలా ముఖ్యమైనవి. ఇందులో సోడియం, ఫైబర్, విటమిన్ సి పెద్ద మొత్తంలో ఉంటాయి. ఒమేగా -3, ఒమేగా -6 హార్మోన్లను సమతుల్యం చేయడానికి పనిచేస్తాయి. దీన్ని పెరుగు, సలాడ్‌తో కలిపి తీసుకోవచ్చు.

పచ్చని కూరగాయలు

ఆకుపచ్చని కూరగాయలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని బలహీనతలు దూరమవుతాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. ఆకుపచ్చ కూరగాయలలో ఫైబర్, పొటాషియం, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. హార్మోన్ల అసమతుల్యత ఉంటే ఆకుపచ్చ కూరగాయలను డైట్‌లో చేర్చుకోవాలి.

పసుపు

పసుపు శరీరంలోని అనేక సమస్యలను దూరం చేస్తుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీవైరల్ గుణాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి హార్మోన్లను సమతుల్యం చేస్తాయి. అందుకే ఏదో విధంగా పసుపును రోజూ తీసుకోవాలి.

పొద్దుతిరుగుడు విత్తనాలు

పొద్దుతిరుగుడు విత్తనాలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో ఫైబర్, పొటాషియం, ఐరన్, విటమిన్ సి ఉంటాయి. ఇవి బరువును నియంత్రించడానికి పని చేస్తాయి. హార్మోన్ల అసమతుల్యత ఏర్పడినప్పుడు పొద్దుతిరుగుడు విత్తనాలను తీసుకోవడం ఉత్తమం.

Tags:    

Similar News