Health Tips: మొటిమలు రావొద్దంటే ఈ రోజు నుంచే వీటిని తినడం మానేయండి..!
Health Tips: ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని కోరుకుంటారు. ఇందుకోసం రకరకాల బ్యూటీ ప్రొడాక్ట్స్‌ని వాడుతారు. అయినప్పటికీ ఎటువంటి ఫలితం ఉండదు.
Health Tips: ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని కోరుకుంటారు. ఇందుకోసం రకరకాల బ్యూటీ ప్రొడాక్ట్స్‌ని వాడుతారు. అయినప్పటికీ ఎటువంటి ఫలితం ఉండదు. పైగా చర్మంపై మొటిమలు వస్తాయి. నిజానికి నేటి కాలంలో కాలుష్యం బాగా పెరిగిపోయింది. దీనికారణంగా చర్మం పాడవుతుంది. మీరు మొటిమల సమస్యతో ఇబ్బంది పడుతుంటే ముందుగా ఆహారంపై శ్రద్ధ పెట్టాలని గుర్తుంచుకోండి. కొన్ని ఆహారాలను తినడం వెంటనే మానేయాలి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
ప్రోటీన్ పౌడర్
మీరు ప్రోటీన్ పౌడర్ వాడుతున్నట్లయితే వెంటనే ఆపేయాలి. ఎందుకంటే ఇందులో ముఖంపై మొటిమలను కలిగించే అమైనో ఆమ్లాలు అధిక మొత్తంలో ఉంటాయి. కాబట్టి దీనిని తీసుకోవడం మానేయండి. లేదంటే మొటిమల సమస్య మరింత పెరుగుతుంది.
పాల ఉత్పత్తులు
పాలు, తీపి, మజ్జిగ వంటి పాల ఉత్పత్తులు మొటిమలను కలిగిస్తాయి. కాబట్టి పాల ఉత్పత్తులను ఎక్కవగా తీసుకోకూడదు. పరిమిత పరిమాణంలో తీసుకంటే పర్వాలేదు. కానీ ఎక్కువగా తీసుకోకూడదని గుర్తుంచుకోండి.
కార్న్ ఫ్లేక్స్
చాలా మందికి రోజూ ఉదయాన్నే కార్న్ ఫ్లేక్స్ తినడం అలవాటు. దీనివల్ల చర్మానికి హాని కలుగుతుంది. ఇందులో షుగర్, మాల్ట్ ఫ్లేవర్‌తో పాటు చర్మానికి హాని కలిగించే హెచ్‌ఎఫ్‌సిఎస్ ఉంటుంది. కాబట్టి మొటిమల సమస్య రావొద్దంటే ఈ రోజు నుంచే వీటిని తినడం మానేయండి.