Personality Development: ఈ అలవాట్లకి దూరంగా ఉండండి.. లేదంటే ఒంటరి అవుతారు..!
Personality Development: మనుషులలో మంచి, చెడు రెండు అలవాట్లు ఉంటాయి. కానీ చెడుని వదిలిపెట్టి మంచిని స్వీకరించేలా ప్రయత్నించాలి.
Personality Development: మనుషులలో మంచి, చెడు రెండు అలవాట్లు ఉంటాయి. కానీ చెడుని వదిలిపెట్టి మంచిని స్వీకరించేలా ప్రయత్నించాలి. కానీ కొంతమంది చెడు అలవాట్లకి బానిసలా మారుతారు. ప్రవర్తన మార్చుకోకుండా ఇతరులకి కోపం, చిరాకు తెప్పిస్తారు. ఇది వారి వ్యక్తిత్వాన్ని దిగజార్చుతుంది. వారికి విలువ లేకుండా చేస్తుంది. కొంతమంది చేసే అలాంటి తప్పుల గురించి ఈరోజు తెలుసుకుందాం.
వారి గురించి మాత్రమే ఆలోచించడం
కొందరికి నిత్యం వారి గురించి మాత్రమే ఆలోచించే అలవాటు ఉంటుంది. ఎదుటి వాళ్లని చులకనగా చూస్తూ వారితో వింతగా ప్రవర్తిస్తారు. అత్యాశగల వ్యక్తులు ఇతరులతో ఎక్కువ సమయం గడపలేరు. వారి గురించి ఆలోచించడం మంచిదే కానీ ఇతరులతో తప్పుగా ప్రవర్తించవద్దు. ఈ అలవాటు ఆఫీసులో మిమ్మల్ని ఒంటరి చేస్తుంది.
అంతరాయం కలిగించడం
మంచి వ్యక్తిత్వం ఉన్నవారు తక్కువ మాట్లాడడం ఎక్కువ వినడం చేస్తారు. కానీ కొందరు ఏ విషయమైనా ఆలోచించకుండా మాట్లాడుతారు. దానిపై అవగాహన లేకున్నా కల్పించుకొని మరీ ఇబ్బందిపెడుతారు. ఈ అలవాటు మంచిది కాదు. దీనివల్ల ఇతరులు మీపై చిరాకు పడుతారు. ఇలాంటి అలవాటుని వదిలిపెడితే మంచిది.
మాటలు, పనిలో తేడా
కొంతమంది మాటలతో కోటలు కడుతారు. కానీ పని విషయంలో సున్నాగా మిగులుతారు. ఈ అలవాటు మంచిది కాదు. ఓవరాక్షన్‌తో వాగ్ధానాలు చేసి వాటిని నిలబెట్టుకోకుంటే పరువు పోతుంది. ఈ అలవాటు వల్ల ఇతరులు మిమ్మల్ని దగ్గరికి రానివ్వరు. అందరిలో చులకనగా మారుతారు. ఇలాంటి వ్యక్తిత్వాన్ని వదులుకుంటే పైకి వస్తారు.
పాజిటివ్‌గా ఉండటం
జీవితంలో సమస్యలు వస్తూనే ఉంటాయి అంతమాత్రన ఆవేశపడకూడదు. ఆ సమస్యలకి కారణమయ్యారని అనవసరంగా ఎవ్వరిని నిందించకూడదు. దీనివల్ల మీపై తప్పుడు అభిప్రాయం ఏర్పడుతుంది. ప్రతి విషయంలో పాజిటివ్‌గా ఉండటం అలవాటు చేసుకోవాలి. ఇదే మిమ్మల్ని అందరిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. కానీ అనవసరంగా టెన్షన్ పడకూడదు.