Health Tips: బరువు తగ్గాలంటే వీటికి దూరంగా ఉండాల్సిందే.. అవేంటంటే..?

Health Tips: ఆహారంపై నియంత్రణ లేకుంటే స్థూలకాయం బారిన పడుతారు.

Update: 2023-01-23 01:30 GMT

Health Tips: బరువు తగ్గాలంటే వీటికి దూరంగా ఉండాల్సిందే.. అవేంటంటే..?

Health Tips: ఆహారంపై నియంత్రణ లేకుంటే స్థూలకాయం బారిన పడుతారు. విపరీతంగా బరువు పెరుగుతారు. దీంతో శరీర ఆకృతి దెబ్బతింటుంది. తర్వాత బరువుని కంట్రోల్‌ చేయడం చాలా కష్టమవుతుంది. అధిక బరువు కారణంగా ఇష్టమైన దుస్తులు ధరించలేరు. కొన్నిసార్లు ఊబకాయం చాలా ఇబ్బందికి గురిచేస్తుంది. ఇలాంటి సమయంలో మీరు పూర్వ స్థితికి రావాలంటే కొన్ని ఆహారాలకి దూరంగా ఉండాలి. ఇలా చేస్తే బరువు వేగంగా తగ్గి కొద్ది రోజుల్లోనే తేడా కనిపిస్తుంది. ఆ ఆహారాల గురించి తెలుసుకుందాం.

టీ

టీ అనేది మన దినచర్యలో ఒక భాగం. కొంతమందికి రోజు ప్రారంభమే టీ సిప్స్‌తో ప్రారంభమవుతుంది. కానీ అది శరీరానికి హానికరం. టీలో ఉండే షుగర్, ఫ్యాట్ బరువు పెరిగేలా చేస్తాయి. ఇది జీవక్రియ రేటును తగ్గిస్తుంది. టీ తాగాలనే కోరికను పెంచుతుంది. అందుకే మిల్క్ టీకి బదులు గ్రీన్ టీ తాగడం ఉత్తమం.

నూనె, నెయ్యి ఉత్పత్తులు

నూనె, నెయ్యి వంటి కొవ్వు పదార్థాలు నేరుగా బరువును పెంచుతాయి. ఇలాంటివి తినడం వల్ల ఊబకాయం వస్తుంది. కూరగాయలు కాకుండా నూనె, నెయ్యి ఉన్న ఆహారాన్ని తినకూడదు. మీరు బరువు తగ్గాలనుకుంటే సమోసాలు, పరాటాలు, పకోడి, మిర్చి, బజ్జి వంటి వాటికి దూరంగా ఉండాలి.

తీపి పదార్థాలు

చక్కెర పదార్థాలు బరువు పెరగడానికి పని చేస్తాయి. తీపి పదార్థాలు తినడం వల్ల బరువు వేగంగా పెరుగుతారు. బరువు తగ్గాలనుకుంటే ఆహారం నుంచి తీపి పదార్థాలను మినహాయించండి. వీటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కొవ్వును పెంచుతాయి. అందుకే తీపి పదార్థాలకి దూరంగా ఉండండి.

అధిక పిండి పదార్థాలు

మీరు బరువు తగ్గాలనుకుంటే కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్నవాటిని తినకూడదు. బంగాళదుంపలు, బియ్యం వంటి వాటిలో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఈ ఆహారాలు నూనె, చక్కెర లేకుండా ఉండవచ్చు కానీ వేగంగా బరువును పెంచుతాయి.

Tags:    

Similar News