Depression: ఈ ఆహారాలు డిప్రెషన్‌కి కారణం అవుతున్నాయి.. తింటే అంతే సంగతులు..!

Depression: ఈ రోజుల్లో చాలా మంది ఒత్తిడికి గురవుతున్నారు.

Update: 2023-03-09 11:37 GMT

Depression: ఈ ఆహారాలు డిప్రెషన్‌కి కారణం అవుతున్నాయి.. తింటే అంతే సంగతులు..!

Depression: ఈ రోజుల్లో చాలా మంది ఒత్తిడికి గురవుతున్నారు. దీనికి కారణం చెడు జీవనశైలి, చెడ్డ అలవాట్లు. మీరు కూడా టెన్షన్‌కి గురవుతున్నట్లయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డైట్‌ నుంచి కొన్ని ఆహారాలని మినహాయించాలి. దీనివల్ల డిప్రెషన్‌ నుంచి బయటపడవచ్చు. వాటి గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం.

షుగర్

మీరు ఎప్పుడూ ఒత్తిడికి లోనవుతున్నట్లయితే ముందుగా ఆహారం నుంచి చక్కెరను మినహాయించండి. ఎందుకంటే తీపి పదార్థాలు మీ శక్తి స్థాయిని ప్రభావితం చేస్తాయి. శరీర అసమతుల్యతను కలిగిస్తాయి. దీని వల్ల మనిషిలో టెన్షన్ పెరగడం మొదలవుతుంది. అందుకే డిప్రెషన్‌తో బాధపడేవారు చక్కెరను తినకూడదు.

ఆల్కహాల్

ఆల్కహాల్ కాలేయానికి మాత్రమే కాకుండా మొత్తం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఆల్కహాల్ మెదడులోని సెరోటోనిన్ చర్యను మారుస్తుంది. ఇది ఆందోళనను పెంచుతుంది. అందుకే మద్యం తాగకూడదు. ఎందుకంటే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల డిప్రెషన్ వస్తుంది.

కెఫిన్ పానీయాలు

కెఫిన్ కలిగిన పానీయాలు అధికంగా తీసుకోవడం వల్ల ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమికి కారణమవుతాయి. మీరు టీ నుంచి చాక్లెట్ వరకు కెఫిన్‌ కలిగినవి ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే వీటివల్ల డిప్రెషన్‌కు గురవుతారు.

ఉప్పు

ఉప్పు మానసిక స్థితిని పాడు చేస్తుంది. మీరు అలసిపోయేలా చేస్తుంది. కానీ పూర్తిగా మానేయకూడదు. తగ్గించి తీసుకుంటే ఉత్తమం.

Tags:    

Similar News