Health Tips: పెరుగులో ఉప్పు కలుపుకొని తినకూడదా..!

Health Tips: ప్రతిరోజు మనం తీసుకునే ఆహార, పానీయాలపై కొంచెం దృష్టి సారించాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనం చేసే పొరపాట్లు వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుంది.

Update: 2023-07-05 16:00 GMT

Health Tips: పెరుగులో ఉప్పు కలుపుకొని తినకూడదా..!

Health Tips: ప్రతిరోజు మనం తీసుకునే ఆహార, పానీయాలపై కొంచెం దృష్టి సారించాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనం చేసే పొరపాట్లు వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుంది. కొన్ని కలపకూడని పదార్థాలని కలిపి తినడం వల్ల అది విషంగా మారే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పెరుగుతో పాటు కొన్ని ఆహారాలని కలిపి తినకూడదు. అలాగే పెరుగుతో ఉప్పు కలపి తినకూడదని చెబుతారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో ఈరోజు తెలుసుకుందాం.

పెరుగులో ఉప్పు కలిపితే లాక్టోబాసిల్లస్ బాక్టీరియా చనిపోతుందని అది తింటే ఎటువంటి ప్రయోజనం ఉండదని చెబుతారు. కానీ ఇందులో వాస్తవం లేదు. పెరుగులో ఉప్పు కలిపిన తర్వాత కూడా అందులో ఉండే విటమిన్లు, పోషకాలు మనకు అందుతాయి. లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా విషయానికొస్తే ఇది ఉప్పు కంటే ప్రమాదకరమైనది. కడుపులో హైడ్రోక్లోరిక్ ఆమ్లం విడుదల చేస్తుంది. ఇది అన్ని రకాల బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది. అందుకే పుకార్లను పట్టించుకోకుండా ఉప్పు లేదా పంచదార కలిపిన పెరుగుని ఆనందంగా తినండి.

అయితే పెరుగుతో పాటు కొన్ని ఆహారాలని కలిపి తినకూడదు. నెయ్యి, పెరుగు కలిపి తీసుకుంటే అజీర్తి సమస్యలు తలెత్తాయి. అలాగే గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం సమస్యలు ఎదురవుతాయి. ఆయుర్వేదం ప్రకారం పెరుగులో పుల్లని, తీపి గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో కఫ దోషాన్ని పెంచుతాయి. రాత్రి సమయంలో శరీరంలో కఫం ప్రాబల్యం ఉంటుంది. ఇది నాసికా భాగాలలో శ్లేష్మం అభివృద్ధికి దారితీస్తుంది. ఈ పరిస్థితిలో ఆస్తమా, దగ్గు, జలుబుకు గురయ్యే వ్యక్తులు రాత్రి భోజనంలో పెరుగుకు దూరంగా ఉండాలి.

Tags:    

Similar News