Heart Blockage: హార్ట్ బ్లాకేజ్ సమస్య ఉంటే ఇవి గుర్తుంచుకోండి.. లేదంటే చాలా ప్రమాదం..!

Heart Blockage: ఈ రోజుల్లో చెడు జీవనశైలి కారణంగా గుండెకు రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. ఈ పరిస్థితినే హార్ట్ బ్లాకేజ్ అన పిలుస్తారు.

Update: 2023-11-12 15:00 GMT

Heart Blockage: హార్ట్ బ్లాకేజ్ సమస్య ఉంటే ఇవి గుర్తుంచుకోండి.. లేదంటే చాలా ప్రమాదం..!

Heart Blockage: ఈ రోజుల్లో చెడు జీవనశైలి కారణంగా గుండెకు రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. ఈ పరిస్థితినే హార్ట్ బ్లాకేజ్ అన పిలుస్తారు. దీనిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. లేదంటే గుండెపోటు సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి ప్రాణాలు పోయే ప్రమాదం ఏర్పడుతుంది. నిజానికి హార్ట్ బ్లాకేజ్ సమస్య ఎందుకు వస్తుంది, ఇది ఎన్ని రకాలు ఉంటుంది.. దీనిని ఎలా నివారించాలి తెలుసుకుందాం.

రక్త సరఫరాలో అంతరాయానికి కారణాలు

1- కండరాల గాయం కారణంగా గుండె ఆగిపోవచ్చు.

2- గుండె కండరం గాయపడినప్పుడు కుడి బండిల్ లో బ్లాక్ ఏర్పడుతుంది.

3- ఇన్ఫెక్షన్ వల్ల హార్ట్ బ్లాకేజ్ సమస్య రావచ్చు.

హార్ట్ బ్లాక్ అయితే ఈ విషయాలను గుర్తుంచుకోండి

1- వేయించిన ఆహారాన్ని తీసుకోవద్దు. ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవద్దు.

2- గుండె ఆగిపోయే సమస్య ఉంటే మార్కెట్‌లో లభించే స్నాక్స్‌కు దూరంగా ఉండాలి.

3- డాక్టర్ ద్వారా రెగ్యులర్ చెకప్‌ చేసుకుంటూ ఉండాలి.

4- హార్ట్ బ్లాక్ అయినప్పుడు బీన్స్, చిక్కుళ్లు, నారింజ, నిమ్మకాయ మొదలైన వాటిని తీసుకోవాలి.

గుండె ఆగిపోకుండా నివారించే మార్గాలు

1- మధుమేహం, థైరాయిడ్ స్థాయిలను అదుపులో ఉంచుకోవాలి.

2- అధిక బరువు గుండె జబ్బులకు కారణమవుతుంది. కాబట్టి బరువును నియంత్రించాలి.

3- ఆల్కహాల్ తీసుకోవడం గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి నివారించాలి.

4- కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవాలి.

5- రోజూ వ్యాయామం చేయాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఉండాలి.

Tags:    

Similar News