Prostate Cancer: పురుషుల్లో విస్తరిస్తున్న ప్రోస్టేట్ క్యాన్సర్.. ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్‌..!

Prostate Cancer: నేటి జీవితకాలంలో పురుషులు వారి ఆరోగ్యం గురించి అస్సలు పట్టించు కోవడం లేదు. కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ ఒత్తిళ్ల వల్ల చెడు అలవాట్లకి బానిసలుగా మారుతున్నారు.

Update: 2023-08-12 15:00 GMT

Prostate Cancer: పురుషుల్లో విస్తరిస్తున్న ప్రోస్టేట్ క్యాన్సర్.. ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్‌..!

Prostate Cancer: నేటి జీవితకాలంలో పురుషులు వారి ఆరోగ్యం గురించి అస్సలు పట్టించు కోవడం లేదు. కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ ఒత్తిళ్ల వల్ల చెడు అలవాట్లకి బానిసలుగా మారుతున్నారు. దీంతో చాలా ఆరోగ్య సమస్యలని ఎదుర్కొంటున్నారు. తాజాగా పురుషుల్లో ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ కేసులు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఆరంభంలో వీటి లక్షణాలను గుర్తించకపోవడం వల్ల ఇది ‌ తీవ్ర సమస్యగా మారుతుంది. ముఖ్యంగా 80 ఏళ్లు పైబడిన వారిలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. ఊబకాయం బాధపడుతున్న వారిలో కూడా ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీని లక్షణాల గురించి తెలుసుకుందాం.

మూత్ర విసర్జనలో ఇబ్బందులు

ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ ప్రారంభ సమయంలో మూత్ర విసర్జనలో ఇబ్బందులు ఏర్పడుతాయి. తరచుగా మూత్ర విసర్జన చేయడం. ముఖ్యంగా రాత్రి సమయంలో ఎక్కువగా మూత్రం వచ్చినట్లుగా అనిపించడం జరగుతుంది.

శరీరంలో నొప్పి

రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం కలిగించే విధంగా శరీరంలో నొప్పి ఏర్పడుతుంది. ఈ లక్షణాలు ఎక్కువగా ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నవారిలో కనిపిస్తుంటాయి. క్యాన్సర్ కణాల ప్రభావంతో తుంటి, పొత్తికడుపులో చాలా నొప్పి వస్తుంది.

మూత్రవిసర్జనలో నొప్పి

ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ ప్రారంభంలో మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి ఉంటుంది. కొన్నిసార్లు మూత్ర విసర్జన చేయడం కష్టంగా మారుతుంది. దీని కారణంగా మూత్రాశయంలో ఇబ్బందులు ఏర్పడుతాయి. పై లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. లక్షణాలు మరింత తీవ్రంగా మారినట్లయితే తప్పనిసరిగా వైద్య చికిత్స తీసుకోవాలి.

తీవ్ర లక్షణాలు

1. మూత్రం లేదా వీర్యంలో రక్తం

2. మూత విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి

3. తరచుగా మూత్రవిసర్జన

4. మూత్రవిసర్జన చేసేటప్పుడు మంట

5. శారీరక సంబంధం సమయంలో నొప్పి

6. మూత్రవిసర్జన ప్రారంభించడానికి ఇబ్బంది

Tags:    

Similar News