Pregnant Women: గర్బిణీలు సుఖ ప్రసవం కోసం రోజూ ఈ వ్యాయామాలు చేయాలి

Pregnant Women: గర్భం దాల్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటారు. కొన్నిపనులకు దూరంగా ఉండాలని పెద్దవాళ్లు అంటుంటారు. కానీ గర్భం దాల్చిన తర్వాత కొన్ని వ్యాయామాలు చేస్తే..సుఖ ప్రసవం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కటి కండరాలు, ఎముకలు బలంగా మారి ప్రసవం తర్వాత కొలుకునే సమయాన్ని కూడా తగ్గిస్తుందని అంటున్నారు. సుఖ ప్రసవం కోసం ఎలాంటి వ్యాయామాలు చేయాలో ఇప్పుడు చూద్దాం.

Update: 2024-07-21 07:34 GMT

Pregnant Women: గర్బిణీలు సుఖ ప్రసవం కోసం రోజూ ఈ వ్యాయామాలు చేయాలి

Pregnant Women:గర్భం దాల్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవలి. ముఖ్యంగా ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే గర్బం దాల్చిన తర్వాత కొంతమంది వ్యాయామం మానేస్తుంటారు. అలాంటి వారు వ్యాయామం మానుకోవాల్సిన పనిలేదని చెబుతున్నారు గైనకాలజిస్టులు. గర్భంలో వ్యాయామాలు చేస్తే కటి కండరాలు, ఎముకలు బలంగా మారి ప్రసవం తర్వాత త్వరగా కోలుకుంటారని చెబుతున్నారు. అయితే గర్భం ధరించిన తర్వాత ట్రైనర్స్ సహాయంతో ఎలాంటి వ్యాయామాలు చేయాలో తెలుసుకుందాం.

ఆర్మ్ ఎక్స్ టెన్షన్ షోల్డర్ ట్యాప్ వ్యాయామం:

గర్భిణీలు ఈ వ్యాయామం చేస్తే ఉదరం, కటి, కాళ్లు , చేతులు, ఇలా శరీరంలోని అన్ని కీలకమైన అవయవాలకు సంబంధించిన కండరాలన్నీ బలంగా మారుతాయి. గర్బంతో పొట్టలో కొవ్వు పేరుకుంటోందని భయపడే మహిళలకు ఈ వ్యాయామం ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. ప్లాంక్ ను పోలిన ఈ వ్యాయామంతో పొత్తికడుపు దగ్గర పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.

- నేలమీద బోర్లా పడుకుని..మోకాళ్ల మీద లేచి ప్లాంక్ భంగిమలో పాదాలు, అరచేతులు, నేలకు ఆనివ్వాలి.

-ఈ భంగిమలో చేతులు, కాళ్ల మీదే శరీర భారం వేయాలి.

-శరీర బరువును కుడిచేతి మీదకు తీసుకురావాలి. ఎడమ చేతితో కుడి భుజాన్ని తాకాలి. తిరిగి చేతును నేలమీదకు ఆనించాలి.

-తర్వాత ఎడమ చేతి మీద శరీరం భారం మోపాలి. కుడి చేతితో ఎడమ భుజాన్ని తాకాలి. తిరిగి చేతిని నేల మీదకు ఆనివ్వాలి.

-ఇలా 30 సెకన్ల పాటు చేయాలి.

ఆర్మ్ సర్కిల్స్:

-నేల మీద కూర్చుండి..లేదా నిలబడి ఈ వ్యాయామం చేయాలి.

-చేతులు రెండు పక్కలకు చాచాలి.

-నిలబడి చేస్తున్నప్పుడు రెండు కాళ్లు మార్చి, మార్చి మడిచి పైకి లేపాలి.

-అపసవ్య దిశలో చేతులు తిప్పుతున్నప్పుడు ఎడమకాలు, సవ్యదిశలో చేతులు తిప్పుతున్నప్పుడు కుడి కాలు పైకి లేపి ఉంచాలి.

-సవ్య దిశలో చేతులను నెమ్మదిగా గుండ్రంగా తిప్పుతుండాలి.

-30 సెకన్ల పాటు చేయాలి.

-తర్వాత అపసవ్య దిశలో నెమ్మదిగా గుండ్రంగా చేతులను తిప్పుతుండాలి.

-తర్వాత చేతులను కిందికి దింపి స్ట్రెచ్ చేయాలి.

-ఈ వ్యాయామానికి కూడా 30 సెకన్ల సమయం కేటాయించాలి. 

Tags:    

Similar News