Power Bill: వేసవిలో పవర్ బిల్లు భయపెడుతోందా.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. సగానికి తగ్గిపోతుంది..!

Bill Reducing Tips: మాడు పగిలిపోయే ఎండలతో దేశ ప్రజలు అల్లాడిపోతున్నారు.

Update: 2023-04-20 15:30 GMT

Power Bill: వేసవిలో పవర్ బిల్లు భయపెడుతోందా.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. సగానికి తగ్గిపోతుంది..!

Bill Reducing Tips: మాడు పగిలిపోయే ఎండలతో దేశ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇంట్లో ఉన్నప్పుడు ఎండ నుంచి కాపాడుకోవడానికి ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు విపరీతంగా వాడేస్తుంటారు. దీంతో కరెంటు బిల్లుల మోత మోగిపోతుంది. కూలింగ్ కోసం వీటిని వాడకుండా ఉండలేం. కానీ, కరెంట్ బిల్లులు చూస్తే మాత్రం పరేషాన్ అవుతుంటాం. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలకు కరెంట్ బిల్లులు ఇబ్బందిగా మారుతుంటాయి. మీరు కూడా ఇలా ఇబ్బందులు పడుతున్నారు.. అందుకోసమే ఈ న్యూస్ తీసుకొచ్చాం. ఈ చిన్న చిన్న మార్పులతో కరెంట్ బిల్లులను సగానికిపైగా తగ్గించుకోవచ్చు. ఈ వేసవిలో ఈ అద్భుతమై గాడ్జెట్‌లను ఉపయోగించి, విద్యుత్‌ను ఆదా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. అవేంటో ఇప్పుడే తెలుసుకుందాం..

సోలార్ ప్యానెల్ - సూర్యుడి కాంతిని విద్యుత్‌గా మార్చడానికి ఈ సోలార్ ప్యానెల్స్‌ను వినియోగిస్తుంటారు. మన ఇంటి కరెంట్ సమస్యలను సోలార్ ప్యానెల్స్‌‌తో తీర్చుకోవచ్చు. ఒక్కాసారి వీటికోసం ఖర్చు చేస్తే.. జీవితాంతం ఫ్రీగా కరెంట్ వాడుకోవచ్చు.

స్మార్ట్ మీటర్ - మనం వాడుతున్న కరెంట్‌ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడానికి ఈ స్మార్ట్ మీటర్‌ను వాడుకోవచ్చు. బిల్లులను తగ్గించుకోవడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి చిప్ సహాయంతో పనిచేస్తాయి.

స్మార్ట్ ప్లగ్స్ - కాలం మారుతున్నా కొద్దీ.. మనం వినియోగించే పరికరాల్లోనూ కీలక మార్పులు వస్తున్నాయి. ఈ క్రమంలో వచ్చినవే స్మార్ట్ ప్లగ్స్. వీటితో మనం ఇంటిలో ఉపయోగించే విద్యుత్ పరికరాలను ఈజీగా స్విచ్ ఆన్ లేదా స్విచ్ ఆఫ్ చేయవచ్చు. ఈ స్మార్ట్ ప్లగ్స్‌ను మొబైల్‌తో కంట్రోల్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇలా చేయడం వల్ల విద్యుత్తును చాలా ఆదా చేసుకోవచ్చు.

పవర్ సేవింగ్ బల్బులు - పవర్ సేవింగ్ బల్బులు లేదా ఎనర్జీ సేవింగ్ లైట్లు చాలా తక్కువ విద్యుత్‌ని వినియోగించుకుంటాయి. ఈ లెట్స్ ఇంట్లో వాడుకోవడం ద్వారా కరెంట్ బిల్లును సగానికి పైగా తగ్గించుకోవచ్చు.

స్మార్ట్ యాప్‌లు - కరెంట్ బిల్లులు తగ్గించుకోవడంలో యాప్‌లు కూడా ఉపగించుకోవచ్చు. ఈ స్మార్ట్ యాప్‌లను ఉపయోగించి, ఇంట్లోని ఎలక్ట్రిక్ పరికరాలను కంట్రోల్ చేసుకోవచ్చు. దీని ద్వార అనవసర ఉపయోగాన్ని తగ్గించుకోచ్చు.

స్మార్ట్ థర్మోస్టాట్ - కరెంట్ బిల్లులను తగ్గించుకోవడానికి స్మార్ట్ థర్మోస్టాట్‌లు బెస్ట్ ఆఫ్షన్. వీటిని కూడా స్మార్ట్‌ఫోన్ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. ముఖ్యంగా వీటిని ఏసీల కోసం వాడుతుంటారు.

Tags:    

Similar News