Health News: పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నారా.. బెస్ట్‌ ఫుడ్స్‌ ఇవే..!

Health News: పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నారా.. బెస్ట్‌ ఫుడ్స్‌ ఇవే..!

Update: 2023-07-18 15:30 GMT

Health News: పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నారా.. బెస్ట్‌ ఫుడ్స్‌ ఇవే..!

Health News: ఆధునిక కాలంలో సంతానోత్పత్తి సమస్యలు పెరిగిపోయాయి. చాలామంది పిల్లలు కనడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఫెర్టిలిటి సెంటర్ల చుట్టూ తిరిగే జంటలు ఎక్కువయ్యాయి. దీనికి కారణం ఫాస్ట్‌ఫుడ్‌ కల్చర్‌ పెరగడమే. మనం ఎలాంటి ఆహారం తీసుకున్నా అది శరీరంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఒకవేళ మీరు పిల్లల కోసం ప్లాన్ చేస్తుంటే కొన్ని విషయాలపై శ్రద్ధ వహించాలి. చైల్డ్ ప్లానింగ్ సమయంలో ఏయే ఆహారాలు తీసుకోవాలో తెలుసుకోవాలి.

బీట్‌రూట్

పిల్లల కోసం ప్లాన్ చేస్తుంటే తప్పనిసరిగా డైట్‌లో బీట్‌రూట్‌ను చేర్చుకోవాలి. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలోని రక్తం పెరగడమే కాకుండా గర్భాశయంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. పిల్లలు కనాలని ఆలోచిస్తున్న మహిళలు కచ్చితంగా బీట్‌రూట్‌ను తినాలి.

గుమ్మడి గింజలు

పొద్దుతిరుగుడు, గుమ్మడికాయ గింజలలో ఒమేగా 3 పెద్ద మొత్తంలో లభిస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్నట్లయితే కచ్చితంగా భార్యాభర్తలు ప్రతిరోజూ గుమ్మడికాయ గింజలను తినాలి.

బీన్స్, పప్పులు

ప్రతిరోజూ ఆహారంలో బీన్స్, పప్పులు ఉండేవిధంగా చూసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల మహిళలకి గర్భం ధరించడంలో ఎటువంటి సమస్య ఉండదు. ఇవి హార్మోన్లను సమతుల్యం చేయడానికి పనిచేస్తాయి. అందుకే కచ్చితంగా డైట్‌లో చేర్చుకోవాలి.

Tags:    

Similar News