Health Tips: జామ పండు ఎవరు తినాలి.. ఎవరు తినకూడదు..!
Health Tips: జామపండుని పేదోడి యాపిల్ అని పిలుస్తారు. ఎందుకంటే యాపిల్లో ఉండే పోషకాలన్ని జామపండులో ఉంటాయి.
Health Tips: జామ పండుని పేదోడి యాపిల్ అని పిలుస్తారు. ఎందుకంటే యాపిల్లో ఉండే పోషకాలన్ని జామపండులో ఉంటాయి. అంతేకాదు ఇది తక్కువ ధరకే లభిస్తుంది. ప్రతి ఒక్కరూ కొనుగోలు చేయవచ్చు. రుచిలో తియ్యగా ఉండటం వల్ల చిన్న పిల్లల నంచి పెద్దవాళ్ల వరకు అందరు ఇష్టపడుతారు. జామ పండు తినడం వల్ల బాడీలో కొలెస్ట్రాల్, రక్త పోటు అదుపులో ఉంటుంది. గుండె సమస్యలు దరిచేరవు. చర్మం యంగ్ గా ఉంటుంది. అయితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోనే వ్యక్తులు జామపండుకి దూరంగా ఉండాలి. వారి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
జీర్ణ సమస్యలు ఉన్నవారు
జామ పండులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువగా జామ పండ్లను తింటే మలబద్ధకం, కడుపులో నొప్పి, ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడేవారు దీనికి దూరంగా ఉంటే బెటర్.
గుండెల్లో మంట
జామ పండులో విటమిన్ సి, ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటాయి. దీంతో గుండె సంబంధిత సమస్యలు ఉన్న వారు జామ కాయకు దూరంగా ఉంటే మంచిది.
డయాబెటీస్
ప్రస్తుతం చాలా మంది డయాబెటీస్ తో ఇబ్బంది పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులోనే షుగర్ వ్యాధితో పోరాడాల్సి వస్తోంది. డయాబెటీస్ పేషెంట్లు జామ కాయను తక్కువ మోతాదులో తీసుకోవాలి. లేదంటే రక్తంలో షుగర్ లెవల్స్ విపరీతంగా పెరుగుతాయి.
జలుబు, ఫ్లూ ఉన్నవారు
ఫ్లూ, జలుబు సమస్యలు ఉన్నవారు జామపండుకు దూరంగా ఉండాలి. లేదంటే ఈ సమస్యలు మరింత ఎక్కువవుతాయి.
రాత్రి పూట తినవద్దు
జామ పండును రాత్రి పూట తీసుకోకూడదు. దీని వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. మధ్యాహ్నం తినడం వల్ల అన్ని విధాల శ్రేయస్కరం.