వేరుశెనగ వెన్న vs బాదం వెన్న.. ఆరోగ్యానికి ఏది ఎక్కువ ప్రయోజనం..!

Peanut Butter vs Almond Butter: ఈ రోజుల్లో చాలామంది డైట్‌లో కచ్చితంగా బటర్‌ ఉండాల్సిందే. ఎందుకంటే పోషకాహార లోపం ఉండకూడదంటే బటర్ వాడాల్సిన అవసరం ఉంది.

Update: 2023-10-16 15:00 GMT

వేరుశెనగ వెన్న vs బాదం వెన్న.. ఆరోగ్యానికి ఏది ఎక్కువ ప్రయోజనం..!

Peanut Butter vs Almond Butter: ఈ రోజుల్లో చాలామంది డైట్‌లో కచ్చితంగా బటర్‌ ఉండాల్సిందే. ఎందుకంటే పోషకాహార లోపం ఉండకూడదంటే బటర్ వాడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు బటర్‌ చాలా అవసరం. అయితే పరిమిత పరిమాణంలోనే తీసుకోవాలని గుర్తుంచుకోండి. అయితే ఏ గింజలతో తయారైన బటర్‌ మంచిదో ఇప్పటికీ చాలా మందికి తెలియదు. మార్కెట్‌లో రెండు రకాల బటర్‌ కనిపిస్తాయి. ఒకటి పీ నట్‌ బటర్‌ మరొకటి ఆల్మండ్‌ బటర్‌ ఈ రెండింటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

వేరుశెనగ వెన్న

వేరుశెనగ వెన్నలో పెద్ద మొత్తంలో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అంతేకాకుండా విటమిన్ E, మెగ్నీషియం, మాంగనీస్‌, అన్ని విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి.

బరువు తగ్గుతారు: వేరుశెనగ వెన్నలో పెద్ద మొత్తంలో ప్రోటీన్, ఫైబర్ ఉంటుంది. ఇవి ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతాయి. దీనివల్ల సులువుగా బరువు తగ్గుతారు.

గుండె ఆరోగ్యం : వేరుశెనగ వెన్నలో పెద్ద మొత్తంలో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

కొలెస్ట్రాల్‌ తగ్గిస్తుంది : వేరుశెనగ వెన్నలో పెద్ద మొత్తంలో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

బాదం వెన్న

బాదం వెన్నలో పెద్ద మొత్తంలో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇంకా విటమిన్ E, మెగ్నీషియం, మాంగనీస్‌తో సహా అన్ని విటమిన్లు, ఖనిజాలకు మూలం.

బరువు తగ్గుతారు: బాదం వెన్నలో పెద్ద మొత్తంలో ప్రోటీన్, ఫైబర్ ఉంటుంది. ఇది ఆకలిని కంట్రోల్‌ చేస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

గుండె ఆరోగ్యం : బాదం వెన్నలో పెద్ద మొత్తంలో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

కొలెస్ట్రాల్‌ నివారణ: బాదం వెన్నలో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

మధుమేహం ప్రమాదం తక్కువ : బాదం వెన్నలో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఇది డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

క్యాన్సర్ ప్రమాదం తక్కువ : బాదం వెన్నలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతాయి.

ఏది ఎక్కువ ప్రయోజనకరం?

వేరుశెనగ వెన్న, బాదం వెన్న రెండూ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. అయితే వ్యక్తి అవసరాలను బట్టి ఏది వాడాలో నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. బరువు తగ్గడానికి, గుండె వ్యాధులు తగ్గించుకోవడానికైతే వేరుశెనగ వెన్న, బాదం వెన్న రెండూ మంచివే. అయితే బాదం వెన్నలో ప్రోటీన్, ఫైబర్ వేరుశెనగ వెన్న కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది ఆకలిని నియంత్రించడంలో బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు మధుమేహం లేదా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నట్లయితే బాదం వెన్న వాడితే మంచిది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు కొంచెం ఎక్కువగా ఉంటాయి.

Tags:    

Similar News