Painkillers: పెయిన్‌ కిల్లర్స్‌ డేంజర్.. అలవాటు పడితే ప్రాణాంతకం..!

Painkillers: ఈ వేగవంతమైన జీవితంలో చాలామంది రకరకాల నొప్పులతో బాధపడుతున్నారు.

Update: 2023-08-23 14:00 GMT

Painkillers:పెయిన్‌ కిల్లర్స్‌ డేంజర్.. అలవాటు పడితే ప్రాణాంతకం..!

Painkillers: ఈ వేగవంతమైన జీవితంలో చాలామంది రకరకాల నొప్పులతో బాధపడుతున్నారు. వీరందరు డాక్టర్‌ సలహా లేకుండా మెడికల్‌ షాపునకి వెళ్లి పెయిన్‌ కిల్లర్ ట్యాబ్లెట్స్‌ తెచ్చుకొని వాడుతున్నారు. కొన్ని రోజులకి ఈ అలవాటు చాలా ప్రాణాంతకంగా మారుతుంది. ఎందుకంటే పెయిన్‌ కిల్లర్స్‌ రెండు వైపుల పదునుండే కత్తిలాంటివి. సరిగ్గా ఉపయోగిస్తే నొప్పి తగ్గుతుంది కానీ పదే పదే వాడితే బానిసలుగా మారుతారు. దీనివల్ల చాలా సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

పెయిన్ కిల్లర్స్‌ సురక్షితం కావు. దీర్ఘకాలికంగా చాలా ప్రమాదకరమైనది. డైక్లోఫెనాక్ అనే సాధారణ ఔషధం తరచుగా ఉపయోగించడం వల్ల గుండెకు సంబంధించిన ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. దీనిపై ఓ అధ్యయనం హెచ్చరించింది. BMJలో ప్రచురించిన ఒక పరిశోధన పారాసెటమాల్, ఇతర సంప్రదాయ ఔషధం నివారణ మందులతో పోల్చి చెప్పింది.వాస్తవానికి పెయిన్ కిల్లర్స్‌ సాధారణ అమ్మకానికి అందుబాటులో ఉండకూడదు. అంతేకాదు ప్యాకేజీ ముందు భాగంలో హెచ్చరిక ఉండాలి.

పెయిన్‌ కిల్లర్‌ను వేసుకోవడం తేలికే కానీ వీటివల్ల భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. కొన్ని రోజులకు మీ శరీరం ఆ పెయిన్ కిల్లర్స్‌కు అలవాటు పడిపోతుంది. తర్వాత అవి వేసుకున్నా పనిచేయవు. అందుకే సహజసిద్దంగా తగ్గించే మార్గాలు అన్వేషించాలి. కొంచెం టైమ్‌ పట్టినా మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ కచ్చితంగా పెయిన్‌ కిల్లర్స్‌ వాడాల్సి వస్తే డాక్టర్‌ని సంప్రదించకుండా వాడవద్దు. దీనివల్ల మీకు ఎంత డోస్‌ సరిపోతుందో తెలుస్తుంది. దాని ప్రకారం నడుచుకోవాలి.

Tags:    

Similar News