Morning Breakfast: ఒక వ్యక్తికి బ్రేక్‌ఫాస్ట్‌ చాలా ముఖ్యం.. ఎందుకంటే..?

Morning Breakfast: ఒక వ్యక్తికి ఉదయంపూట బ్రేక్‌ఫాస్ట్‌ చాలా ముఖ్యమైనది.

Update: 2023-06-14 01:30 GMT

Morning Breakfast: ఒక వ్యక్తికి బ్రేక్‌ఫాస్ట్‌ చాలా ముఖ్యం.. ఎందుకంటే..?

Morning Breakfast: ఒక వ్యక్తికి ఉదయంపూట బ్రేక్‌ఫాస్ట్‌ చాలా ముఖ్యమైనది. లేదంటే చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. చాలామంది ఉద్యోగులు ఆఫీసు రద్దీ కారణంగా బ్రేక్‌ఫాస్ట్‌ చేయకుండా వెళుతారు. ఈ అలవాటు తీవ్రమైన వ్యాధులకు కారణం అవుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌పై అవగాహన ఉన్న మహిళలు ఉదయాన్నే వంటగదిలో అల్పాహారం కోసం ఏర్పాట్లు చేస్తారు. అయితే ఆరోగ్యానికి బ్రేక్‌ఫాస్ట్‌ ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈరోజు తెలుసుకుందాం.

1. బ్రేక్‌ఫాస్ట్‌ని మిస్‌ చేస్తే ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలుగుతుంది. ఎందుకంటే ఇది శక్తికి అతిపెద్ద వనరు. ముఖ్యంగా పని చేసే వ్యక్తులకు అల్పాహారం మరింత ముఖ్యమైనది. డెస్క్ వర్క్ అయినా ఫీల్డ్ వర్క్ అయినా ఉదయాన్నే ఏమీ తినకుండా పనికి బయలుదేరితే శరీరంలో బలహీనత ఏర్పడుతుంది. అందుకే ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలని ఎంచుకోవాలి.

2. బ్రేక్‌ఫాస్ట్‌ అతి ముఖ్యమైనది ఎందుకంటే ఇది శరీర జీవక్రియను పెంచుతుంది. దీని కారణంగా శరీరంలోని కేలరీలు రోజు మొత్తం ఖర్చవుతాయి. మనిషిని శక్తివంతంగా ఉంచుతుంది. ఉదయం అల్పాహారం తీసుకోవడం మర్చిపోతే అది మీ పని ఉత్పాదకతపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

3. ప్రతిరోజు బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. దీంతోపాటు రక్తంలో చక్కెర స్థాయి స్థిరంగా ఉంటుంది. అల్పాహారంలో పండ్లు, తృణధాన్యాలు, ప్రోటీన్లు సమృద్ధిగా ఉండాలని గుర్తుంచుకోండి.

4. బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోకపోవడం వల్ల అన్ని వేళలా అలసిపోతారు. తగినంత నిద్ర కూడా ఉండదు. దీంతో ఎప్పుడు చూసినా నీరసంగా బలహీనంగా కనిపిస్తారు.

Tags:    

Similar News