Dry Fruits: ఈ డ్రై ఫ్రూట్స్‌ని పాలలో కలుపుకొని తాగితే లెక్కలేనన్ని ప్రయోజనాలు..!

Dry Fruits: ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు కనీసం 2 గ్లాసుల పాలు తాగాలి.

Update: 2023-06-01 13:30 GMT

Dry Fruits: ఈ డ్రై ఫ్రూట్స్‌ని పాలలో కలుపుకొని తాగితే లెక్కలేనన్ని ప్రయోజనాలు..!

Dry Fruits: పాలు సంపూర్ణ ఆహారం. ఇందులో శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు ఉంటాయి. అందుకే పిల్లలు, వృద్ధులు, యువకులు అన్ని వయసుల వారు తాగుతారు. ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు కనీసం 2 గ్లాసుల పాలు తాగాలి. అయితే వేడి పాలలో కొన్ని డ్రై ఫ్రూట్స్ కలిపితే వాటి పోషక విలువలు గణనీయంగా పెరుగుతాయి. శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. అది ఏ విధంగానో తెలుసుకుందాం.

డ్రై ఫ్రూట్స్ నేరుగా లేదా నానబెట్టి తింటారు. అయితే జీడిపప్పు, ఎండుద్రాక్ష, బాదంపప్పులను మెత్తగా చేసి పాలలో కలుపుకొని తాగాలి. ఇది పాల రుచిని పెంచడమే కాకుండా అద్భుత పోషకాలని అందిస్తుంది. దీనివల్ల చర్మం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా జుట్టు మెరిసిపోతుంది. ముఖం మచ్చలేనిదిగా మారుతుంది. ఎందుకంటే ఇది మొటిమలు, మచ్చలను తొలగించడంలో సూపర్‌గా పనిచేస్తుంది. ఇంకా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా ఇన్ఫెక్షన్, అనేక వ్యాధులను నివారించవచ్చు.

పాలలో ఉండే క్యాల్షియం సహాయంతో ఎముకలు దృఢంగా మారతాయి. వీటికి ఒక 3 డ్రైఫ్రూట్స్ కలిపితే ఎముకలు మరింత గట్టిగా అవుతాయి. ఎందుకంటే వీటిలో క్యాల్షియంతో పాటు విటమిన్ డి, మెగ్నీషియం కూడా ఉంటాయి. దీంతో కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, జిమ్‌ చేసేవారు ఈ డ్రింక్‌ తీసుకోవాలి. దీనివల్ల వారికి మరింత శక్తి లభిస్తుంది. అలసిపోకుండా ఉంటారు. 

Tags:    

Similar News