Health Tips: ఉసిరితో ఈ బెరడు కలిపిన జ్యూస్‌.. ఈ ఆరోగ్య సమస్యలకి దివ్యవౌషధం..!

Health Tips: ఉసిరికాయలో అద్భుత ఔషధ గుణాలు దాగి ఉన్నాయి.

Update: 2023-06-21 15:00 GMT

Garlic In Summer: వేసవిలో వెల్లుల్లి వేడి చేస్తుందా.. శరీరంపై దీని ప్రభావం ఎలా ఉంటుందంటే..?

Health Tips: ఉసిరికాయలో అద్భుత ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అందుకే దీనిని ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ప్రతిరోజు పరగడుపున ఉసిరి, అర్జున బెరడు జ్యూస్‌ లేదా కలబంద, గిలోయ్ రసాలు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ జ్యూస్‌లు తాగడం వల్ల అనేక రోగాలు నయమవుతాయి. వీటివల్ల శరీరానికి కలిగే ప్రయోజనాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

ఉసిరి, అర్జున్ బెరడు రసం

ముందుగా ఉసిరికాయని చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రైండర్‌లో పేస్టులా చేసుకోవాలి. తర్వాత ఈ గుజ్జు రసాన్ని వడకట్టి విడిగా ఉంచుకోవాలి. తరువాత ఒక పాత్రలో 2 కప్పుల నీరు పోసి అధిక మంట మీద మరిగించాలి. దానికి అర్జున్ బెరడు కలపాలి. నీరు సగానికి తగ్గే వరకు మరిగించాలి. తర్వాత అందులో ఉసిరి రసాన్ని కలపాలి. ఇప్పుడు ఈ రసంలో తేనె వేసి బాగా కలపాలి. కొద్దిగా చల్లారిన తర్వాత తాగాలి. రోజు తాగితే కొద్ది రోజుల్లోనే దాని ప్రభావం కనిపిస్తుంది.

ఉసిరికాయ, అర్జున్ బెరడు రసం ప్రయోజనాలు

ఉసిరి, అర్జున్ బెరడు రసం తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ జ్యూస్ శరీరానికి విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, టానికా, ఫైటోకెమికల్స్‌ని అందిస్తుంది. ఇది మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో తోడ్పడుతాయి. ఇది వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది.

ఉసిరికాయ, అర్జున్ బెరడు రసం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అర్జున బెరడులోని ఫైటోకెమికల్స్ రక్తపోటును నియంత్రిస్తాయి. గుండెకి సంబంధించిన వ్యాధులని దూరం చేస్తుంది. జీర్ణక్రియ సమస్యలని తొలగిస్తుంది. కడుపుని క్లీన్‌గా చేస్తుంది. సీజనల్‌ వ్యాధులని అరికడుతుంది. దగ్గు, జలుబు లాంటి వ్యాధులని నయం చేస్తుంది.

Tags:    

Similar News