Health Tips: చిటికెడు ఇంగువతో దగ్గు, జలుబు, తలనొప్పికి చెక్..!

Health Tips: చిటికెడు ఇంగువతో దగ్గు, జలుబు, తలనొప్పికి చెక్..!

Update: 2022-10-28 13:32 GMT

Health Tips: చిటికెడు ఇంగువతో దగ్గు, జలుబు, తలనొప్పికి చెక్..!

Health Tips: నిత్య జీవితంలో అనేక ఆరోగ్య సమస్యలని ఎదుర్కొంటాం. కానీ అన్ని సమస్యల పరిష్కారానికి డాక్టర్‌ వద్దకు వెళ్లడానికి ఇష్టపడం. అయితే వంటింట్లో ఆయుర్వేద గుణాలు ఉన్న అనేక పదార్థాలు ఉంటాయి. వాటిలో ఒకటి ఇంగువ. ఇది వంటలలో వేస్తే సువాసన పెరుగుతుంది. అయితే ఇంగువ ఉపయోగించడం వల్ల అనేక వ్యాధుల నుంచి బయటపడవచ్చు. చాలా మంది నిపుణులు ఇంగువని వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు ఉంటాయని చెబుతారు. వాటి గురించి తెలుసుకుందాం.

తలనొప్పి: తరచుగా తలనొప్పి సమస్య ఉంటే ఇంగువ నీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. అలాగే రక్త నాళాలలో వాపును తగ్గిస్తుంది. తద్వారా తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

జలుబు,దగ్గు: గోరువెచ్చని ఇంగువ నీరు తాగడం వల్ల శ్వాసకోశ సమస్యలను నయం చేయవచ్చు. దీంతో పాటు జలుబు, దగ్గు తగ్గుతుంది. మారుతున్న సీజన్‌లో క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

బరువు తగ్గడం: ఇంగువ వాటర్‌తో పెరుగుతున్న బరువును తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. బరువును అదుపులో ఉంచుతుంది. అలాగే దీని వినియోగం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News