Mens Health Tips: పురుషులు బలంగా ఉండాలంటే వీటిని కచ్చితంగా తినాలి.. కొద్దిరోజుల్లోనే మార్పు గమనిస్తారు..!

Mens Health Tips: నేటి వేగవంతమైన జీవితంలో పురుషులు చాలా బలహీనంగా మారుతున్నారు. ఉద్యోగాలు చేస్తూ కుటుంబ బాధ్యతలు మోస్తూ చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు

Update: 2023-07-24 01:30 GMT

Mens Health Tips: పురుషులు బలంగా ఉండాలంటే వీటిని కచ్చితంగా తినాలి.. కొద్దిరోజుల్లోనే మార్పు గమనిస్తారు..!

Mens Health Tips: నేటి వేగవంతమైన జీవితంలో పురుషులు చాలా బలహీనంగా మారుతున్నారు. ఉద్యోగాలు చేస్తూ కుటుంబ బాధ్యతలు మోస్తూ చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు. దీనివల్ల ప్రోస్టేట్ క్యాన్సర్, అధిక కొలెస్ట్రాల్, డయాబెటీస్‌, మైగ్రేన్ వంటి అనేక వ్యాధులకి గురవుతున్నారు. ఇలా కాకూడదంటే మంచి ఆహారాన్ని తీసుకోవాలి. ప్రోటీన్లు, ఖనిజాలు, కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారాలని ఎంచుకోవాలి. అప్పుడే రోజు మొత్తం పనిచేసినా అలసిపోకుండా ఉంటారు. అయితే పురుషులు తమని తాము ఫిట్‌గా ఉంచుకోవడానికి డైట్‌లో కచ్చితంగా కొన్ని రకాల ఆహారాలని చేర్చుకోవాలి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

1. కొవ్వు చేపలు

పురుషులు బలంగా ఉండాలంటే డైట్‌లో కొవ్వు చేపలని చేర్చుకోవాలి. ఇది మెదడును పదునుగా మారుస్తుంది. ఇందులో ఉండే ప్రొటీన్లు కొత్త కణాల ఏర్పాటుకు సహకరిస్తాయి. అలాగే ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుకు మేలు చేయడమే కాకుండా క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. అంతేకాదు గుండె, కండరాలు బలంగా మారతాయి. వ్యాధులకి దూరంగా ఉండాలనుకుంటే ఆహారంలో కొవ్వు చేపలను ఖచ్చితంగా చేర్చుకోవాలి.

2. పాలు

పాలలో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. ఇది ఎముకల అభివృద్ధికి ఉత్తమమైనదిగా చెప్పవచ్చు. రోజూ పాలు తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. స్ట్రోక్ సమస్య తక్కువగా ఉంటుంది. పాలలో ఉండే మెగ్నీషియం, పెప్టైడ్‌లు శరీరంలోని గ్లూకోజ్, ఇన్సులిన్ సెన్సిటివిటీని సమతుల్యం చేస్తాయి. కండరాలను బలంగా తయారు చేయడానికి పాలు ఉత్తమంగా పనిచేస్తాయి. కాబట్టి ప్రతిరోజూ పాలను తాగడం అలవాటు చేసుకోవాలి.

3. గుడ్లు

ప్రతి ఒక్కరి డైట్‌లో గుడ్లు ఉండాల్సిందే. ఎందుకంటే ఇవి పోషకాలతో నిండి ఉంటాయి. కాబట్టి ప్రతిరోజూ గుడ్లు తినాలని చెబుతారు. ఇందులో కాల్షియం, ఆరోగ్యకరమైన కొవ్వు, కేలరీలు, సోడియం, పొటాషియం పెద్ద మొత్తంలో లభిస్తాయి. అలాగే ఐరన్, ప్రోటీన్, విటమిన్ డి, విటమిన్ B6, మెగ్నీషియం కూడా ఉంటాయి. అందుకే ఆహారంలో గుడ్లు చేర్చుకోవాలి.

4. గ్రీన్ వెజిటబుల్స్

పచ్చి కూరగాయలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. దివ్య ఔషధంగా పనిచేస్తాయి. ఇందులో పోషకాలు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి. వీటిని నిత్యం ఆహారంలో చేర్చుకుంటే రోగాల బారిన పడకుండా ఉంటారు.

5. గింజలు, విత్తనాలు

ఆరోగ్యానికి గింజలు, విత్తనాలు ఎల్లప్పుడూ మంచివే. ఇవి రెండూ ఆరోగ్యకరమైన కొవ్వును కలిగి ఉంటాయి. అనేక పోషకాలతో నిండి ఉంటాయి. అనేక ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. గుండె జబ్బులు, జ్ఞాపకశక్తి సమస్యలు, ఎముక బలహీనత మొదలైన వాటి నుంచి రక్షిస్తాయి.

Tags:    

Similar News